గర్భధారణ సమయంలో మహిళలు తినే వస్తువులు పిల్లల బరువును కూడా ప్రభావితం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. అందుకే మహిళలు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రెగ్నెన్సీ సమయంలో మెడిటరేనియన్ డైట్ పాటించటం వల్ల పిల్లలలో చిన్ననాటి హోబకాయాన్ని నివారించవచ్చని తాజా అధ్యయనం సూచిస్తుంది. ఈ అధ్యాయనం ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బబేసిటిలో ప్రచురించింది. మెడిటరేనియన్ డైట్ పాటించే స్త్రీలకు పుట్టే పిల్లలకు ఉబకాయం వచ్చే అవకాశం కేవలం 6 శాతం మాత్రమే ఉందని తెలింది. ఇది మొక్కల ఆధారిత ఆహారం.
ఇందులో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చుక్కళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. ఈ కాలంలో మీరు రెడ్ మీట్ ను నెలలో 2 నుండి 3 సార్లు మాత్రమే తినవచ్చు. ఈ ఆహారంతో వ్యాయామం చెయ్యటం ముఖ్యం. నూనె, నెయ్యి లేదా వెన్నకు బదులుగా, ఆలివ్ లేదా కనోలా నువ్వు నేను ఉపయోగించాలి. ఆహారంలో రుచి పెరగాలంటే ఉప్పు తక్కువగా, మూలికలను ఎక్కువగా వాడతారు. మెడిటరేనియన్ ఆహారంలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాన్ని అనుసరిస్తే, పిల్లలు యుక్త వయస్సు వరకు ఉబకాయం నుంచి సురక్షితంగా ఉంటారు. గర్భ ధారణ సమయంలో మధ్యధరా ఆహారం తీసుకోవటం వల్ల గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం కేవలం 35% తగ్గుతుంది. అలాగే కడుపులో పిల్లల బరువు కూడా తక్కువగా ఉంటుంది.