ఏకాగ్రతలోపిస్తుంది. సడన్ గా మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. బయటపడాలంటే తరచుగా ఆకుకూరలు, పండ్లు, తృణ ధాన్యాలు వంటి ఫోలేట్ పరిమాణం అధికంగా ఉండే ఆహారాలు తగినంతగా తీసుకుంటూ ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీరంలోన్ ఐరన్ లోపం ఉంటే ప్రవర్తనలో అయోమయం నెలకొంటుంది. హిమోగ్లోబిన్ తయారీలో శరీరానికి ఐరన్ చాలా ముఖ్యం. ఇది లోపిస్తే ఎనిమియా వంటి రక్త హీనత వ్యాధులు వస్తాయి. దీంతో శరీరంలోని అవయవాలకు రక్తం సరిగ్గా సరఫరా కాదు. ఫలితంగా నీరసం, తీవ్రమైన అలసట, కళ్లు, తల తిరగటం వంటివి సమస్యలు సంభవిస్తుంటాయి.
ఆకుకూరలు, గుడ్డు, మాంసం వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. శరీరంలో విటమిన్ డి లోపం కూడా అలసట, అయోమయానికి, మానసిక సమస్యలకు దారితీస్తుంది. కాల్షియం అది సరిగ్గా ఉన్నప్పుడే సరైన శక్తి లభిస్తుంది. లేకుంటే కండరాలు, ఎముకల బలహీనత ఏర్పడుతుంది. సమస్య నుంచి బయటపడాలంటే రోజు కాసేపు ఉదయపు ఎండలో నిలబడాలి. ఇలా చేస్తే విటమిన్ డిని శరీరం సహజంగానే పొందుతుంది. దీంతో పాటు ఫ్యాటి చేపలు, గుడ్లు, వంటివి తినాలి. ఈ విటమిన్ లోపిస్తే నరాల బలహీనత, నీరసం, అలసట, తలనొప్పి వేధిస్తాయి. మానసిక పరిస్థితిలో మార్పులు రావచ్చు. నిజానికి విటమిన్ బి 12 శరీరానికి చాలా ముఖ్యం. ఇది రక్తనాళాలను, కణాలను ఉత్తేజ పరుస్తుంది.