అటువంటి పరిష్కారాలలో ఒకటి కర్పూరం, లవంగాలు. ఈ రెండు పదార్థాలను కలిపి ఉపయోగించటం ద్వారా అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకే లవంగం, కర్పూరం కి సంబంధించిన కొన్ని వివారణల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజల్లో భాంగంగా కర్పూరంతో హారతి చేస్తుంటారు. ఇక లవంగం ఒక మసాలా, ఇది వంట గదిలో దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కర్పూరం, లవంగాలు గాలిని శుద్ధి చేయడానికి పనిచేస్తాయి. దీన్ని వెలిగించడం ద్వారా ఇంటి వాతావరణం స్వచ్ఛంగా, పవిత్రంగా, సువాసనగా మారుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జి ఉంటే కర్పూరాన్ని వెలిగించటం ద్వారా దూరం చేసుకోవచ్చు.
కర్పూరం, లవంగాలు సానుకూలతకు చిహ్నాలు. వైవాహిక జీవితంలో గొడవలు చెలరేగుతున్నట్లయితే లవంగం, కర్పూరంతో నివారణలను చెయ్యాలని చెబుతున్నారు పండితులు. ప్రతిరోజు మీ పడకగదిలో ఇత్తడి లేదా వెండి పాత్రలో కర్పూరాన్ని వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయటం ద్వారా భార్యాభర్తల బంధం బలపడి పరస్పర ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయని చెబుతున్నారు. మీ ఇంట్లో అధిక సమస్యలు ఉంటే రాత్రి పడుకునే ముందు వెండి గిన్నెలో 2 లవంగాలు, 1 కర్పూరం వేసి వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయటం ద్వారా డబ్బు సంబంధిత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయంటున్నారు. కుటుంబంలో కష్టాలు పెరిగితే ఒక కర్పూరం, 5 లవంగాలను వెండి పాత్రలో వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయటం ద్వారా కుటుంబంలోని కష్టాలు తగ్గి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.