కానీ పూరీలు ఆరోగ్యానికి మాత్రం మంచిది కావు. ఎందుకంటే వీటిని మొత్తం నూనెలో డిప్ ఫ్రై చేసి తయారుచేస్తాయి. దీంతో పూరీలకు బాగా నూనె అంటుకుంటుంది. ఇలాంటి ఆయిలీ పూరీలను తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయం ఉంటుంది. అంతేకాదు ఇది మీ బరువు పెరిగేలా కూడా చేస్తుంది. చాలామంది పూరీలను ఏమైనా పండుగలు లేదా స్పెషల్ ఈవెంట్స్ లోనే తయారు చేస్తుంటారు. అయినా నూనె భయంతో కూలీలను అస్సలు తినాలనించదు. కానీ మీరు హెల్తి పూరీలను తినాలనుకుంటే మాత్రం కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే. అవును దీనికోసం మీరు పూరీలను డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. నూనెలోనే కాదు...
మీరు ఆవిరిలో కూడా డేస్టీ డేస్టీ పూరీలను తయారు చేయవచ్చు. నిజానికి పూరీలను ఆవిరి పట్టడం ఒక ఈజీ పద్ధతి. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కానీ ఈ పూరీలు క్రిస్పిగా ఉండవు. కానీ నూనెలో వేయించిన మాదిరిగా పూరీలు బాగా ఉబ్బుతాయి. మొత్తగా ఉంటాయి. ఇందుకోసం ఏం చేయాలంటే? ముందుగా పిండిని బాగా కలిపి బాల్స్ తయారుచేయండి. ఆ తర్వాత వాటిని గుడ్రంగా చపాతీలాగా చేసుకొండి. ఇప్పుడు స్టీమర్ ను రెడి చేసి అందులో రోల్ చేసిన పూరిని పెట్టండి. అయితే పూరిలు ఒకటికొకటి అత్తుకొక్కుండా చూసుకోండి. పూరీలు మెత్తబడే వరకు 5 నుంచి 7 నిమిషాలు ఆవిరిలో ఉంచండి. ఇందుకోసం గాజు నూతన ఉపయోగించండి. దీంతో పూరీలు ఉబ్బడం మీకు కనిపిస్తుంది. పూరి ఉబ్బిన వెంటనే వాటిని ఒక ప్లేట్ లోకి తీయండి. ఈ మెత్తని పూరీని మీరు మీకు నచ్చిన కర్రీతో తినొచ్చు.