అందంగా కనిపించాలని చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతిరోజు తలస్నానం చేస్తుంటారు. నూనె అసలు పెట్టరు. కానీ ఇది మీ జుట్టును దెబ్బతీస్తుంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. అసలు తలస్నానం రోజు చేస్తే ఏమవుతుంది? ఎన్ని రోజులకోసారి తల స్నానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పనులకు, కాలేజీలకు, ఆఫీలకు వెళ్లేవారు చాలా మంది ప్రతిరోజూ షాంపుతో తలస్నానం చేస్తుంటారు. కానీ దీనివల్ల మీ జుట్టుకు ఉన్న సహజ నూనెలు తొలగిపోతాయి. దీనివల్ల మీ వెంట్రుకలు పొడిబారుతాయి.
అందుకే మీరు ప్రతి రోజు తలస్నానం చేయాలనుకుంటే గనుక మితమైన సల్ఫేట్ లేని షాంపును ఉపయోగించండి. ఇకపోతే వేడి వేడి నీళ్లతో తలస్నానం చేయకూడదు. ఇది మీ జుట్టును దెబ్బతీస్తుంది. కాబట్టి వేడి నీళ్లకు బదులుగా గోరువెచ్చని నీళ్లను ఉపయోగించండి. అలాగే మీ నెత్తికి షాంపూను పెట్టి కాసేపు మసాజ్ చేయండి. దీంతో నెత్తిమీదున్న అదనపు నూనె, జుట్టుకు అంటుకున్నమురికి తొలిగిపోతుంది. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లో జుట్టు చివర్లను గట్టి గట్టిగా రుద్దకూడదు. మీ జుట్టు ఆరడానికి డ్రైయ్యర్ ను వాడకండి. జుట్టు సహజంగా ఆలేలా చెయ్యండి. మీ జుట్టు హెల్దిగా ఉండాలంటే రోజువారి జుట్టు సంరక్షణ చాలా అవసరం. అలాగే జుట్టుకు నూనె పెట్టాలి. అప్పుడే మీ జుట్టుకు మంచి పోషణ అందుతుంది. జిడ్డుగా మారితే తప్ప రోజు తలస్నానం చెయ్యకపోవటమే మంచిది.