ఈరోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా జుట్టు అనేది తెల్లబడిపోతుంది. చిన్న వాళ్ళకి కూడా తెల్ల జుట్టు వచ్చేస్తుంది. తెల్ల జుట్టు రావటం వల్ల రంగు అనేది ఎక్కువ వాడుతున్నారు. ఆ రంగు వాడటం వల్ల ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. తెల్ల జుట్టు సాధారణం అయిపోయింది. ప్రస్తుతం చిన్న పిల్లల్లో కూడా వైట్ హెయిర్ కనిపిస్తుంది. దీనికి కారణం అనారోగ్యమైన ఆహారం తీసుకోవటం, డైట్ పాటించకపోవటం, సరైన లైఫ్ స్టైల్ మెయిలటెయిన్ చెయ్యకపోవటం, కాలుష్యం వంటి చాలా కారణాలున్నాయని చెప్పుతున్నారు నిపుణులు. ఎర్లీగా గ్రే హెయిర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.


అధిక కెఫిన్ వినియోగం ఐరన్ శోషణను ప్రభావితం చేస్తుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను బలహీనపరుస్తుంది. త్వరగా తెల్లబడటానికి దారితీస్తుంది. ఆల్కహాల్ విటమిన్ బి, జింక్, కాపర్ స్థాయిలను తోలగిస్తుంది. ఇవన్నీ హెయిర్ కలర్ మేనేజ్మెంట్ లో కిలకం కాగా జుట్టు నెరవకుండా నివారించడానికి ముఖ్యమైనవి. అధిక చెక్కర కుల్లాజెన్ ను దెబ్బతీస్తుంది, న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా బలహీనమైన జుట్టు, పిగ్మెంటేషన్ ను నివారించడానికి అవసరమైన పోషకాలను క్షిణింపజేస్తాయి. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా పురుషుల్లో బట్టతలకు ఈ పానీయాలు కారణమని అధ్యాయనాలు కూడా నిరూపించాయి.

 వేయించిన ఆహారాలు అనారోగ్యమైన కొవ్వులు కలిగి ఉంటాయి. వాపుకు కారణం అవుతాయి. జుట్టు రంగుకు కారణమయ్యే మెలనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. అధికంగా ప్రాసెస్ చేయబడిన స్నాక్స్ చిప్స్, క్రాకర్స్ పోషకాలను కలిగి ఉండవు. వీటివల్ల విటమిన్ లోపం తలెత్తుతుంది. తద్వారా చిన్నవయసులోనే తెల్ల జుట్టుకు దారితీస్తుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఉదాహరణకు రిఫ్రెండ్ వైట్ బ్రెడ్, పాస్తా, బియ్యంలో పోషకాలు ఉండవు. రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయవచ్చు, ఇది జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నెరిసేందుకు కారణం అవుతుంది. అనారోగ్య కరమైన కొవ్వులు, తక్కువ పోషకాలు, జంక్ ఫుడ్ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యం, రంగును ప్రభావితం చేస్తుంది. అధిక ఉప్పు శరీరాన్ని డిహైడ్రేట్ చేస్తుంది. పోషకాల శోషణను పరిమితం చేస్తోంది, తెల్ల జుట్టు ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: