జపాన్ లో పెళ్లికి ముందు వ్యక్తులు ఎలా నిద్రిస్తారో, పెళ్లి తర్వాత కూడా వారి నిద్ర అలవాట్లు అలానే ఉంటాయి. అలాగని భాగస్వాములు శృంగారంలో పాల్గొనరు అనుకుంటే పొరపాటే. కాకపోతే దేనికి కేటాయించిన సమయం వరకు మాత్రమే ఒకే బెట్ పై ఉంటారట. తర్వాత నిద్రపోయేందుకు వేర్వేరు మంచాల పైకి మారుతారు. పైగా ఇది జపాన్ సంస్కృతి లేదా ఆచారంలో భాగమని నిపుణులు చెబుతున్నారు. అలాగని దంపతుల మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండదని భావించాల్సిన అవసరం లేదు. ఇక్కడి జంటల్లో లవ్ అండ్ ఎమోషనల్ బాండింగ్ కూడా అధికమే అంటున్నారు నిపుణులు.
అయితే కచ్చితంగా విడిగా పడుకోవాలని సాంప్రదాయాన్ని కొనసాగించాలని కూడా ఎవరూ ఒత్తిడి చేశారు. అది జంటల వ్యక్తిగత అభిప్రాయం, నిర్ణయానికే పూర్తిగా వదిలేస్తారు. కాకపోతే అనాదిగా వస్తున్న ఆచారం గా ఇప్పటికీ చాలామంది దీనిని గౌరవిస్తూ శృంగార కార్యకలాపాల తర్వాత భార్య భార్తలు విడిగా పడుకుంటారు. జపాన్ ఆరోగ్య, కార్మిక సంక్షేమ మంత్రిత్వశాఖ తరపున 2019 లో నిర్వహించిన సర్వేల ప్రకారం 20 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్సుగల 1,662 మంది జంటలను నిపుణులు ప్రశ్నించారు. వీరిలో 29.2 శాతం మంది జంటలు మాత్రమే ఒకే ఒడ్ పై నిద్రిస్తున్నారు. మిగతా చాలామంది ఒకే గదిలో పడుకుంటున్నప్పటికీ, నిద్రించే సమయంలో మాత్రం వేర్వేరు బెడ్లకు మారుతారు.