గ్రామాలు ఎక్కడ చూసినా మునుపటిలా కనిపించడం లేదంటున్నారు ప్రకృతి ప్రేమికులు. క్రమంగా ఇవి కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అసలు కాకులే కనబడవేమోనని ఆందోళన కూడా పలువురిలో వ్యక్తం అవుతుంది. చూడడానికి నల్లగా ఉంటాయేమో కానీ... కాకులు జీవ వైవిధ్యంలో తమ వంతు పాత్రను పోషించటం ద్వారా పర్యావరణానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇట్లు ప్రజల నమ్మకాల పరంగానూ అవి ముఖ్యమైనవే. ఇంటి ముందు కాకులు అరిస్తే ఎవరు బంధువులు వస్తారని నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారు.
ఎవరైనా ఎక్కువగా అరుస్తుంటే కూడా ఎందుకలా కాకిలా అరుస్తావు అనేవారు లేకపోలేదు. ఇక సనాతన ధర్మం లోనూ కాకులకు ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా చనిపోయినప్పుడు నిర్వహించే కర్మలో భాగంగా పిండ ప్రదానం చేసేటప్పుడు కాకులు వచ్చి ఆ పదార్థాన్ని ముడితేనే శుభ సూచకంగా భావిస్తారు. అయితే అవి వచ్చి పిండా ప్రసాదాలను ఆరగించడం కూడా ఇప్పుడు కష్టమైపోయింది. కారణం కాకులు కనుమరుగై పోతున్నాయి. ఇటు పాజిటివ్ గాను, అటు నెగిటివ్ గానూ కాకులను ప్రజలు అనేక అంశాల్లో ఉపయోగించుకుంటారు. ఇక కవులు, కళాకారులు కూడా వాటి గురించి చాలానే చెప్పారు. ' కాకులు నలుపు, కోకిల నలుపు, కాటుక నలుపు, చీకటి నలుపు' అంటూ అల్లుకున్న పదబందాలు కవితలుగా జాలువారి ఎంతో మందిని అలరించాయి.