నానబెట్టిన కిస్మిస్ అనేది ఒక సహజసిద్ధమైన ల్యాక్సేటివ్ గా పనిచేస్తుంది. శరీరానికి పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు కిస్మిస్ తో లభిస్తాయి. కిస్మిస్ లో పోలిఫినాల్, ఫ్లెవనాయిడ్స అనే యాంటీ ఆక్సిడెంట్లు ప్రీ రాడికల్స్ నాశనం చేస్తాయి. స్వెల్లింగ్ తగ్గిస్తుంది. రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే అద్భుతమైన లాభాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఫైబర్ జీయనా క్రియను మెరుగుపరుస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది. మధ్యాహ్నం వేళ చాలామందికి ఎనర్జీ తక్కువగా ఉండి నీరసంగా అనిపిస్తుంటుంది.
ఈ సమయంలో కిస్మిస్ తినటం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఇందులో నేచురల్ స్వీట్ ఉంటుంది. నానబెట్టిన కిస్మిస్ లోని ఫ్రక్టోస్, గ్లూకోజ్ మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. అలాగే రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి. రెగ్యులర్గా వీటిని తింటే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. నానబెట్టిన కిస్మిస్ లో ఓలినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతక్షయం ఏర్పడకుండా నివారిస్తుందని చెబుతున్నారు. తద్వారా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తహీనత దూరం చేస్తుంది. నానబెట్టిన కిస్మిస్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బాడీలో సోడియం లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఈ కిస్మిస్ ను తప్పకుండా తినండి.