అనారోగ్యాన్ని బీట్ చేస్తుందని చెబుతుంటారు. బీట్ రూట్ ను నిత్యం తీసుకుంటే శరీరానికి లభించే ప్రయోజనాలను తెలుసుకుందాం. ప్రతిరోజు ఆహారంలో బీట్ రూట్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు ఆరోగ్యా న్నిపుణులు. దీన్ని వల్ల అనేక వ్యాధులు దూరం అవుతాయని వెల్లడించారు. ముఖ్యంగా గుండె సమస్యలను తగ్గిస్తుంది అంటున్నారు. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే మీ మంచి ప్రయోజనాలు చేకూరతాయి అంటున్నారు. చురుకుగా ఉండటానికి బీట్ రూట్ మంచి ఔషధం మీ డైట్ లో రోజు వారీగా చేర్చుకుంటే మీ కింద తెలిపిన వ్యాధులకు చెక్ పెట్టవచ్చుని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బీట్ రూట్ లో ఉండే దుంపల్లో అద్భుతమైన ప్రయోజనాలుఉన్నాయి. ఇందులో ఉండే సైట్రేట్లలో రక్త ప్రసరణను పెంచే లక్షణం ఉంటుంది.
గుండె జబ్బులను రాకుండా కాపాడుతుంది. బీట్ రూట్ లో క్యాలరీలు తక్కువగానూ, పీచు పదార్థాలు ఎక్కువగాను ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఆకలిని నియంతరించడంలో సహాయపడుతుంది. దీని మొత్తం కేలరీలు తీసుకోవటం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలంటే బీట్ రూట్ ను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఉడికించిన 100 గ్రాముల బీట్ రూట్ లో 44 కెలరీలు, 1.7 గ్రాముల ప్రోటీన్, 0.2 గ్రాముల కొవ్వు, 2 గ్రాములు ఫైబర్ కంటెంట్ ఉంటాయి. ఈ డైట్ ఫాలో అయితే బరువు తగ్గుతారు. బీట్ రూట్ లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలు ఇందులో ఉంటాయి. ఆంథోసైనిన్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా కణాల్లో శక్తిని ... సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇందులో ఉండే నైట్ర్ ట్లు శరీరం పనితీరును మెరుగుపరుస్తాయి.