పిల్లలు ఎక్కువగా వర్షంలో తడవడం వల్ల జలుబు దగ్గు సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వ్యాధి అందరినీ వేధిస్తుంది. ఎంతగానో దగ్గు వస్తూనే ఉంటుంది. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ దగ్గు సమస్య వేధిస్తుంది. ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాధుల ఏకకాలంలోనే విస్తరిస్తున్నాయి. కొన్ని చోట్ల మంకీ ఫాక్స్, మరికొన్ని చోట్ల డెంగ్యూ, చికున్ గున్యా పంటి వ్యాధులు పెరుగుతున్నాయి. అలాగే కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. వీటన్నిటితో పాటు అక్కడక్కడా వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. ఇదలా ఉంటే ఇప్పుడు కోరింత దగ్గు సమస్యను కూడా ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

 గోరింత దగ్గు పెర్టుసిస్ వైరస్ బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. నిరంతర దగ్గు, గురక, దగ్గు తరువాత వాంతులు, ముఖం నీలం రంగులోకి మారటం వంటి లక్షణాలు చిన్న పిల్లలలో కనిపిస్తాయి. ఈరోజుల్లో బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి. అలాగే ఈ కోరింత దగ్గు కూడా చాలా దేశాల్లో మరణానికి కారణమైంది. దీని కేసులు కూడా చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. 2024 లో దీని కారణంగా ఇద్దరూ మరణించారు. మరణించిన వారిలో 5 వారాల శిశువు, 65 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. గత ఏడాది కూడా నెదర్గాండ్స్ లో గోరింత దగ్గు కారణంగా 8 మరణాలు నమోదయ్యాయి.

అలాగే ఫ్లాండర్స్ లో 2024 లో ఇప్పటికే 2,217 గోరింత దగ్గు కేసులు నమోదయ్యాయి. తక్కువ దేశాల్లో మాత్రమే గోరింత దగ్గు ఇన్ఫెక్షన్ల వేగంగా పెరుగుతున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. యూరోపియన్ సెంటర్ ఫర్ డిపిజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇతర యూరోపియన్ దేశాలు కూడా పెరుగుతున్న కేసులను చూస్తున్నాయని నివేదించింది. దీంతో ఈ వ్యాధి రాబోయే కాలంలో పిల్లలు, వృద్ధులకు కూడా పెద్ద ముప్పుగా మారబోతుందని చెబుతున్నాయి. గోరింటా దగ్గు లేదా పెర్టుసిస్ బోర్డెటెల్లా అనే బాక్టీరియా వల్ల వస్తుంది. ఈ అంటూ వ్యాధి శ్వాసకోశకు సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఈ బ్యాక్టీరియా గాలిలో వ్యాపిస్తుంది. ఇతర వ్యక్తులు ఊపిరి పీల్చుకున్నప్పుడు వారి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: