ఇదిలా ఉంటే పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. కొన్ని అంచనాల ప్రకారం ఒక నవంబర్ – డిసెంబర్ నెలలోనే 35 లక్షల పెళ్లిళ్ల జరగాల్సి ఉంది. ఈ పెళ్లిళ్లకు మొత్తం రూ.4.25 లక్షల కోట్ల ఖర్చు అవుతుందని అంచనాలు వేస్తున్నారు నిపుణులు. ఒక భారతీయుడు తన పెళ్లికి తన చదువు కంటే కూడా రెట్టింపు ఖర్చు చేస్తున్నాడని నివేదికలు చెబుతున్నాయి. కొంతమంది దృష్టిలో ఇది వృధా ఖర్చు కావచ్చు, కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వృధా వ్యయం భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతునిస్తోంది. ఈ ఏడాది నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో భారత్ లో 35 లక్షలకు పైగా వివాహాలు జరుగుతున్నాయని అంచనా.
ఇందులో దాదాపు రూ.4.25 లక్షల కోట్ల ఖర్చవుతుందని అంచనాలు వేస్తున్నాయి కొన్ని నివేదికలు. భారతదేశంలో ప్రతి సంవత్సరం కోటి వివాహాలు జరుగుతున్నాయి. ఈ రంగం భారతదేశంలో నాలుగోవ అతిపెద్ద పరిశ్రమగా మారింది. ఈ ఏడాది పెళ్లిళ్లకు 130 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని, కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనాలు కూడా ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని అంచనా. భారతదేశంలో మతపరంగా, సామాజికంగా బంగారం చాలా ముఖ్యమైనది, విలువైనది. ప్రజలు దీన్ని పెట్టుబడిగా కూడా చూస్తారు.