పిల్లలు స్కూల్ కు వెళ్లాలంటేనే భయపడి ఏడ్చిసే పరిస్థితి ఏర్పడినప్పుడే వారు డిడాస్కలీనో ఫోబియాకు గురై ఉంటారని అనుమానించాలి. మొదటిసారి బడికి వెళ్ళినప్పుడు, ఆ తరువాత కూడా ఒక నెలో, రెండు నెలలో పాఠశాలకు వెళ్లాలంటే పిల్లలు సహజంగానే భయపడుతుంటారు. కానీ ఎప్పుడూ అదే కొనసాగితే ఆ భయం మరింత ఎక్కువైపోతుంటే మాత్రం వారిలో డిడాస్కలీనో ఫోబియా డెవలప్ అయ్యి ఉండవచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. చిన్నపిల్లలకు అర్థం అయ్యేలా నచ్చ జెప్పడం, ప్రేమగా మందలించటం,
మరి ఎక్కువగా భయపెట్టకుండా డీల్ చేయడం వంటివి చేస్తే పర్లేదు. కానీ కొందరు పేరెంట్స్, స్కూళ్లల్లో టీచర్లు చిన్నపిల్లలను డీల్ చేసే విధానం సరిగ్గా ఉండదు. దీంతో డిడాస్కలీనో ఫోబియా తలెత్తుతుంది. ఫలితంగా స్కూల్ కు వెళ్లాలంటేనే భయపడిపోతారు. చిన్నపిల్లల మనస్తత్వం తెల్ల కాగితం లాంటిది అంటారు. నిజానికి చిన్నప్పుడు ఏ విషయమైనా ఇట్టే గ్రహించడం, గుర్తు పెట్టుకోవడం వీరిలో కనిపించే సహజ లక్షణం. అలాంటప్పుడు చదువు కూడా వారికి ఈజీ గానే వస్తుంది. ఇకపోతే బాగా చదవాలని అధిక ఒత్తిడికి గురి చేయడం, ఎక్కువగా దండించడం వంటి కారణాలతో భయం వల్ల కూడా పిల్లలలో తడబాటు, చదివింది గుర్తుకు లేకపోవడం, నేర్చుకుని సోమర్థ్యం దెబ్బ తినటం వంటివి జరగవచ్చు. ఈ కారణంగా చదువులో రాణించకపోవడం సోఫో ఫోబియాగా నిపుణులు పేర్కొంటున్నారు.