దీర్ఘకాలం కొనసాగితే మధుమేహం, హార్మోన్ల అసమదూల్యత సహా పలు ఇతర అనారోగ్యాలకు దారి తీయవచ్చు. సాధారణంగా అనేక వ్యాధులకు ఒత్తిడి కూడా కారణం అవుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఏ అనారోగ్య సమస్య అయిన ముందుగా స్ట్రెస్ తోనే ప్రారంభం అవుతుంది. అలాంటి వాటిలో డయాబెటిస్ కూడా ఒకటి. అందుకే ఒత్తిడికి, మధుమేహానికి మధ్య సంబంధం ఉందని వాయిద్య నిపుణులు చెప్తుంటారు. ఎలాగంటే... స్ట్రిస్ కు గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీని కారణంగా బాడీలో గ్లూకోస్ లెవెల్స్ పెరుగుతాయని, మధుమేహానికి కారణం అవుతాయని చెప్పారు.
కార్టిసాల్ తో పాటు కాటెకోలమైన్స్, థైరాయిడ్ సహా శరీరంలోని వివిధ హార్మోన్లలో మార్పులు, హెచ్ తగ్గులు ప్రారంభిస్తాయని, ఈ పరిస్థితి హార్మోన్ల అసమతుల్యతకు, ఇతర వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఒత్తిడి తక్కువగా ఉండే జీవనశైలిని కలిగి ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ఒత్తిడి అనేది సహజమే అనుకుంటాం. అది సాధారణంగా ఉన్నంతవరకు పర్లేదు కానీ... అధిక ఒత్తిడి అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి లక్షణాలను గుర్తించి జాగ్రత్తపడితే స్ట్రెస్, యాంగ్జైటి, డిప్రెషన్, మధుమేహం సహా పలు ఇతర వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. ఇక లక్షణాల విషయానికి వస్తే కండరాల నొప్పి, తలనొప్పి, నిద్రలేమి, తరచుగా అనారోగ్యానికి గురవుతుండడం, అలసట, ఆకలి మందగించటం లేదా అధిక ఆకలి వంటివి ఒత్తిడిలో ఉన్న వ్యక్తుల్లో కనిపించే లక్షణాలు.