అలాగే మరింత క్రమశిక్షణ కూడా అలవాటు అవుతోంది. మార్నింగ్ నిద్ర లేస్తే ఎన్నో విజయాలు సాధించవచ్చు. అయితే బ్రహ్మ ముహూర్తం సమయంలో రోజు నిద్రలేచి... ఒక గంట టైమ్ కేటాయిస్తే మీ జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకోసం తెల్లవారుజామునే ఈ రెండు పనులు చేస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. తెల్లవారు జామున 3. 30 నిమిషాల నుంచి 5 లోపు సమయన్నిబ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ టైమ్ కు చాలా మంది అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమాయానికి లేచిన వారు ఎక్కువ కాలం బతుకుతారని, సానుకూలమైన జీవితాన్ని పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.
అయితే సూర్యోదయానికి గంట ముందు మేల్కొని... బ్రహ్మ ముహోర్తంలో చేయాల్సిన రెండు పనులు ఏంటో చూద్దాం... ఉదయం నాలుగు గంటలకు లేచి.. దినచర్యలో 30 నిమిషాల ప్రాణాయామం, 30 నిమిషాల బిస్కే నడకను చేయండి. తెల్లవారు చామున ఎలాంటి కాలుష్యం ఉండదు కాబట్టి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఫ్రెష్ ఆక్సిజన్ కూడా పొందవచ్చు. ఈ ప్రాణాయామంలో భ్రస్తిక, భ్రమరి, అనులోమ విలోమ, ప్రాణవ ప్రాణాయామ పద్ధతులు ఫాలో అవ్వాలి. వీటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. శరీర వ్యాధులను తొలగించడంలో ఎంతో మేలు చేస్తాయి. అందుకోసం తెల్లవారుజామునే ఈ రెండు పనులు చేస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు.