పూర్వకాలంలో చింతకాయలు దొరికితే చాలు చింతకాయ పచ్చడి చేసేవారు. ఇప్పుడు కూడా చాలామంది ఈ చింతకాయ పచ్చడిని తింటున్నారు. నోరూరించే ఈ చింతకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. చింతకాయతో ప్రయోజనాలు అనేకం. లేత చింతచిగురును కూరల్లో ఉపయోగిస్తారు. చాలా రుచిగా ఉంటుంది. అలాగే చింతకాయతో పులిహోర, పచ్చడి, చింతపిక్కలి బిస్కెట్ ల తయారీ కోసం ఉపయోగిస్తారు. ఈ చింతపండు కొలెస్ట్రాల్ ను సమతుల్యం చేయటంలో మేలు చేస్తుంది. షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

ఇక రక్తపోటుతో బాధపడేవారికైతే ఇదొక మంచి మెడిసిన్. పలు రకాల అల్సర్లను నివారించటంలో కూడా సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న చింతపండుతో చాలా మంది ముద్దపప్పు వేసి నప్పుడు తప్పక వారు చేసి కమ్మగా తింటుంటారు. అప్పట్లో చింత చెట్టు కొమ్మను పాఠశాలల్లో పిల్లల్ని శిక్షించడానికి వాడేవారు. అరకిలో పచ్చి చింతకాయలు తీసుకోవాలి. వీటితో పాటు పచ్చి మిర్చి 5, జీలకర్ర ఒక స్పూన్, పసుపు – అర స్పూన్, కొత్తిమీర తరుగు - ఒక కప్పు, సరిపడ బెల్లం తరుగు, జీలకర్ర – ఒక స్పూను, ఒక స్పూను మినప్పప్పు, ఆవాలు ఒక స్పూను, 6 ఎండుమిరపకాయలు, సరిపడా సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు తీసుకోవాలి.

 ముందుగా చింతకాయలను క్లీన్ గా కడిగి పెచ్చులను తీసి.. ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయాలి. వీటితో పాటు అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, జీలకర్ర, బెల్లం, వెల్లుల్లి రెబ్బలు, సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత తాళంపు వెయ్యాలి. గ్యాస్ పై కడాయి వేసి... ఆయిల్ వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి వేగాక, వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, పసుపు, మినప్పప్పు వేసి బాగా వేయించుకోవాలి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కడాయిలో వేసి కలపాలి. రెండు నిమిషాలు అలా ఉంచితే చింతకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే రుచి బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: