రక్తంలోని మలినాలను, వ్యర్థాలను వడబోసి మూత్ర విసర్జన రూపంలో బయటకు పంపడంలో కీ రోల్ పోషిస్తాయి. అట్లనే సోడియం, పొటాషియం, కాల్షియం వంటి రసాయనాల లెవెల్స్ ను సమతుల్యం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. రక్తాన్ని వడబోసి అవసరం లేని వ్యర్థాలను, విషపదార్థాలను శరీరం నుంచి బయటకు పంపించడంలో కిడ్నీలో బాధ్యత వహిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.అవే గనుక సరిగ్గా పని చేయకపోతే బాడీలో టాక్సిన్లు పెరుగుపోతాయని,ఎర్ర రక్త కణాలను తయారు చేయటంలో వైఫల్యం చెందుతాయని అంటున్నారు.
అంతేకాకుండా శరీరానికి, మెదడుకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అందకపోవటంతో తరచుగా అలిసిపోతుంటారు. మూత్ర విసర్జన సమయంలో రక్తం పడుతున్న, ఎక్కువగా నురుగు వస్తున్న అది మూత్రపిండాలు సరిగ్గా పని చేయటం లేదని సంకేతనంగా అనుమానించాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మూత్రం గోధుమ రంగులోకి లేదా లైట్ కలర్ లోకి మారిపోతుంది. ఈ పరిస్థితిలో యూరిన్ తో పాటు బ్లడ్ రావచ్చు. కిడ్నీలో రాళ్లు, కణితులు, ఇన్ఫెక్షన్లు ఉన్న రక్తం లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కండరాల బలహీనత, తరచుగా తిమ్మిరి పట్టడం వంటి లక్షణాలు మూత్ర పిండాల పనితీరు సరిగ్గా లేదనే సంకీర్తనాలను సూచిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అలాంటప్పుడు నరాలపై ఒత్తిడి పెరుగుతుంది.