బాడీ తగ్గటం కోసం డైట్ చేస్తూ ఉంటారు. ఎంత డైట్ చేసినా బాడీ అనేది అసలు తగ్గకుండా ఉంటుందా? ఎందుకు అలా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజుల్లో చాలామంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే థైరాయిడ్ వంటి సమస్యలు వస్తున్నాయి. మీరు కూడా అలాంటి బాధితుల్లో ఒకరా....? ఈ థైరాయిడ్ కారణంగా మీరు అధిక బరువు పెరిగిపోతున్నారా...? థైరాయిడ్ కారణంగా బరువు మాత్రమే కాదు... బెల్లీ ఫ్యాట్ కూడా పెరిగిపోయి ఇబ్బంది పడేవారు కూడా ఉన్నారు. ఈ సమస్యలు మీకు కూడా ఉంటే.. ఇక వాటికి పూర్తిగా గుడ్ బై చెప్పొచ్చు. మీ డైట్ లో వేటిని చేర్చుకోవడం వల్ల... థైరాయిడ్ సమస్యలను కంట్రోల్ చేయటంతో పాటు..... అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ ని ఈజీగా కరిగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

థైరాయిడ్ ఈరోజుల్లో సాధారణ సమస్యగా మారినప్పటికీ... ఇది సరైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోవటం వల్లే వస్తుందని విషయం చాలామందికి తెలిదు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్, మంచి ఆహారం, శరీరక శ్రమ లేకపోవడం వల్ల థైరాయిడ్ మాత్రమే కాదు... ఊబకాయం, రక్తపోటు, గుండె జబ్బులు, ఆందోళన, ఒత్తిడి లాంటి సమస్యలు కూడా రావటం మొదలైతాయి. ఆ సమస్యలన్నిటికీ మనం ముందుగా ... వ్యాయామం, నుంచి ఆరోగ్యకరమైన ఆహారాలతోనే చెక్ పెట్టొచ్చు. మన శరీరంలోని ప్రధాన గ్రాందులలో థైరాయిడ్ ఒకటి. ఈ గ్రంధి శరీరంలో దాదాపు ప్రతి పనికి అవసరం.

 ఇది ఇతర హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ శరీరంలో తక్కువ లేదా ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు, అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ పనితీరుపై ప్రభావం కారణంగా, మొదట జుట్టు రాలటం మొదలవుతుంది, జీర్ణ క్రియ బలహీనంగా మారుతుంది, చర్మం పేగులకు సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. ఇది కాకుండా, బరువు వేగంగా పెరుగుతాం. పొట్ట చుట్టూ కొవ్వు కూడా పేరుకు పోతుంది. నిపుణుల ప్రకారం... హైపోథైరాయిడిజం ఉన్న వారిలో విషపూరిత కాలేయం ఉంటుంది. దీనివల్ల T4, T3 గా మారడానికి చాలా సమయం పడుతుంది. థైరాయిడ్ కారణంగా మీ పొట్ట సాగినట్లుగా మారినట్లయితే, అక్కడ మీ లివర్ లో కూడా ఫ్యాట్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాలేయం నిర్విషికరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి, బరువు, పొట్టు కొవ్వును తగ్గించడంలో సహాయపడే 4 పోషకాలు ఇక్కడ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: