నిజానికి నేచురల్ పద్ధతిలో కూడా మీరు ఈ అందాన్ని పెంచుకోవచ్చు. ఇవి మీ ముఖానికి ఎలాంటి హాని చేయవు. అంతేకాకుండా.. చర్మానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. ఇలాంటి వాటిలో జామ ఆకులు ఒకటి. అవును జామ ఆకులతో కూడా ముఖాన్ని అందంగా మార్చవచ్చు. ఆ ఆకుల్లో విటమిన్ సి, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ 20 ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి. అలాగే ముఖంపై నల్ల మచ్చలను, తెల్ల మచ్చలను పోగొట్టడానికి బాగా సహాయపడతాయి. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటే..
మరికొంతమందికి ఆయిలీ కిన్ ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారు ఎంత మేకప్ వేసిన... కొద్దిసేపటికే జిడ్డుగా మారుతుంది. ఇలాంటి వారు ఏ కాస్మోటిక్స్ ఉపయోగించిన ఎలాంటి యూస్ ఉండదు. అయితే ఇలాంటి వారికి జామ ఆకులు బాగా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందుకోసం ముందుగా గుప్పెడు జామ ఆకులను తీసుకుని నీళ్లలో నానబెట్టండి. దీన్ని టేస్ట్ గా చేసుకునే అందులో కొద్దిగా నిమ్మ రసాన్ని కలిపి ముఖానికి, మెడకు బాగా పట్టించండి. 30 నిమిషాల తర్వాత కూల్ వాటర్ తో ముఖాన్ని మెడను శుభ్రం చేయండి. చామ ఆకుల్లో ఉండే పోషకాలు మీ ముఖంలో ఉండే నూనెను నియంతరించడానికి సహాయపడుతుంది. ఈ పద్ధతి జిడ్డును చాలా వరకు తగ్గించడానికి సహాయపడుతుంది.