బయటకు వెళితే చాలు ఏదో ఒకటి తినకుండా ఉండము. పెళ్లిళ్లు లేదా ఫంక్షన్లకు వెళ్తే కచ్చితంగా భోజనాలు ఉంటాయి. అవి తిన్నా వెంటనే ఇలాంటి ప్రయోగాలు అసలు చేయకండి. తినే ముందు చేతులను పక్కాగా కడుక్కుంటాం. కొంతమంది అయితే నోటిని కూడా కడుక్కుంటారు. అంటే నోట్లో నీళ్లు ఓసి వుక్కిలిస్తుంటారు. ఇది మంచి అలవాటే. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అస్సలు మంచిది కాదు. మనలో చాలామంది పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, ధావత్ లకు, ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో హోటల్ కు వెళ్ళినప్పుడు పైపుల నుంచి వచ్చే నీళ్లతో నోటిని కడుక్కుంటుంటారు.

అలాగే పెళ్లి మండపాల్లో భోజనం చేసిన తరువాత చేతులను కడుక్కోవటంతో పాటుగా నోట్లో నీళ్లు పోసుకుని పుక్కలిస్తుంటారు. దీనివల్ల నోరు క్లీన్ అవుతుందని అనుకుంటుంటారు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో ఎక్కడ తాకినా... ఎన్నో అంటువ్యాధులు మనకు అంటుకుంటున్నాయి. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల ద్వారా కొత్తకొత్త అంటువ్యాధులు మనకోస్తాయి. అయితే మన ఆహారపు అలవాట్లలో వచ్చి మార్పు వల్ల చాలా మందికి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది.

దీనివల్ల వీరికి చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అందుకే మీరు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావోద్దండే మాత్రం మీరు ఖచ్చితంగా పరిశుభ్రతను పాటించాలి. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్లలో ఉన్న పైప్ లైన్ల నీటిని వాడకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినండి. బయటి ఫుడ్ ను అవాయిడ్ చెయ్యండి. అలాగే పరిశుభ్రంగా ఉండాలి. హోటల్ అయనా , కళ్యాణ మండపాల్లో అయినా ట్యాబ్ వాటర్ తో నోటిని శుభ్రం చేయకండి. ఎందుకంటే ఇలాంటి వాటర్ ట్యాంక్ లు శుభ్రంగా ఉండవు. ఇవి నీళ్ల ద్వారా మనకు ఎన్నో వ్యాధులు వచ్చేలా చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: