హిందూ పెళ్లిళ్లు చూడటానికి చాలా బాగుంటుంది. హిందూ పెళ్లిళ్లు మంచి హడావిడిగా చేస్తుంది. సాంప్రదాయంగా జరుగుతుంది. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం వివాహ నమోదు మన ఇష్టం పైనే ఆధారపడి ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మహిళలు తమ వివాహాన్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వివాహం తరువాత తన ఇంటి పేరును మార్చుకుని స్త్రీకి వివాహ ధృవీకరణ పత్రం చాలా ముఖ్యమైనది. కాగా అది లేకపోతే మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఏంటో తెలుసుకుందాం.

 హిందూ వివాహ చట్టం, 1955 సెక్షన్ 8, హిందూ వివాహాలను నమోదు చేయడానికి వీలు కల్పిస్తుంది. అయితే ప్రతి రాష్ట్రంలో వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని నిబంధనలు లేవు. సెక్షన్ 8లోని 5 వ పేరా .. మ్యారేజ్ నమోదు చేయటంలో వైఫల్యం వల్ల వివాహం చెల్లుబాటు ప్రభావితం కాదని పేర్కొంది. అంటే హిందూ వివాహం చెల్లుబాటు సప్తపది వేడుకపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరు హిందూ వ్యక్తుల మధ్య తమ ఆచారాల ప్రకారం వివాహం జరిగితే అది చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడుతుంది. అయితే నమోదు చేసుకోకపోవడం వలన వైవాహిక జీవితంలో స్త్రీని ప్రభావితం చేసే సమస్యలు కూడా లేకపోలేదు. గృహహింస, వేధింపులు, వైవాహిక అత్యాచారం మొదలైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు...


భర్తకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేయటం, పోరాటం జరుగుతుంది. కానీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ లేని సందర్భాల్లో కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తవచ్చు. న్యాయం జరగాకపోవచ్చు. పెన్షనరీ,హెల్త్ బెనిఫిట్స్, సర్వైవర్ క్లెయిమ్ లు వంటి సామాజిక భద్రత ప్రయోజనాలను క్లెయిమ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ఉద్యోగాల పెన్షన్ స్కీమ్ ప్రకారం.. వివాహిత సభ్యుడు కుటుంబ పెన్షన్ పొందేందుకు తన జీవిత భాగస్వామి, పిల్లలను మాత్రమే నామినేట్ చేయగలడు. అతని తల్లిదండ్రులను కాదు. కాబట్టి వివాహ ధృవీకరణ పత్రం కలిగి ఉండటం వల్ల స్త్రీ తన భర్త Eps లో సభ్యురాలిగా ఉన్నట్లయితే.. దీన్ని నుంచి వచ్చే పెన్షన్ ప్రయోజనాలను పొందేందుకు సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: