బయటకి వెళితే చాలు మంచూరియాని బాగా ఇష్టంగా తింటాము. మంచూరియా అంటే ప్రాణాలు ఇచ్చేసా వారే ఉంటారు. ఆలు మంచూరియా మరింత టేస్టీగా ఉంటుంది. కామన్ గానే మంచూరియా అంటే చాలామందికి ఇష్టం. బయటకెళ్తే చాలు.. ఏమైనా తినాలనిపిస్తే ముందుగా మంచూరియాకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అయితే ఎప్పుడు రొటీన్ గానే కాకుండా ఈసారి కొత్తగా ఆలూ తో మంచూరియాను రెడీ చేయండి. సులువుగా తయారయ్యే ఈ స్నాక్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. రెండు పెద్దల గైజులో ఉండే బంగాళదుంపలు తీసుకోండి. అలాగే సగం కప్పు మైదాపిండి, ఓవేవేళ కావాలనుకుంటే పావు కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోవచ్చు.

అర చెంచా కారం, అల్లం ముద్ద, సగం టీస్పూన్ ఉప్పు, డిప్ ఫ్రై కి సరిపడా నూనె. నాలుగు చెంచాల నూనె, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, రెండు చెంచాల టమాటా సాస్, 2 చెంచాల నూనె, 2 చెంచాల ఉల్లిగడ్డల తరుగు, వెల్లుల్లి రెబ్బలు, అర చెంచా మిరియాల పొడి సన్నటి మొక్కల తరుగు, 1 చెంచా సోయాసాస్. ముందుగా ఆలూ పైన పొట్టు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఒక పాత్రలో వాటర్ పోసి అందులో సాల్ట్ వేసి ఉడికించాలి. బాగా మెత్తగా అయ్యేవరకు ఉడికించాకూడదు. ఒక బౌల్ లో కార్న్ ఫ్లోర్, అల్లం ముద్ద, మైదా, కారం, ఉప్పు వేసి హాట్ వాటర్ పోసుకోవాలి. బజ్జీ పిండిలా జారుగా కలుపుకోవాలి.

తర్వాత గ్యాస్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి.. మీడియం ఫ్లో లో ఉంచండి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపలని మైదా విశ్రమంలో ముంచి ఆయిల్ లో వెయ్యండి. గోల్డ్ కలర్ లోకి వచ్చాక తీసి ఓ బబుల్ లో పెట్టండి. తరువాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచి... అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, క్యాప్సికం ముక్కలు, ఉల్లిగడ్డలు వేసి 10 నిమిషాలు అయ్యాక టమాటా సాస్, మిరియాల పొడి, సాల్ట్, సోయా సాస్ వేసి కలపండి. తరువాత 2 స్పూన్స్ వాటర్ కార్న్ ఫ్లోర్ తో కలిపి ఉడుకుతున్న సాస్ లో వెయ్యండి. 5 నిమిషాలయ్యాక పక్కకు పెట్టుకున్నా బంగాళాదుంపల్ని అందులో కలపాలి. లాస్ట్ లో తరిగిన ఉల్లిగడ్డలను వేసుకుంటే టేస్టీ టేస్టీ ఆలు మంచూరియా రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: