పుల్లని ఆహారాలు లాలాజలం, జీర్ణ రసాలను కూడా పేరేపిస్తాయి. జీర్ణక్రియ, పోషకాల శోషణకు సహాయపడతాయి. ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. సిట్రస్ పండ్ల వంటి అనేక పుల్లని ఆహారాలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది రోగ నిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఐరన్ శోషణను పెంచుతుంది. US డిపార్ట మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం.. వంద గ్రాముల నిమ్మకాయలో 53 mg విటమిన్ సి ఉంటుంది. అలాగే USDA ప్రకారం... 100 గ్రాముల నారింజలో 53.2mg విటమిన్ సి ఉంటుంది.
పుల్లని ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి అవి ఆక్సికరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి... గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించబడిన 2019 ఆధ్యాయంలో పెరుగు వినియోగం, తక్కువ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదానికి మధ్య సంబంధాన్ని పరిశోధకులు కనుగొన్నారు. పుల్లని ఆహారాలు కోరికలను అరికట్టడానికి, కడుపు నిండిన అనుభూతిని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. తద్వారా వెయిట్ మేనేజ్మెంట్ లో ప్రయోజనకరంగా ఉంటాయి. 2017లో క్రిటికల్ రివ్యూస్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లో ప్రచురించిన పరిశోధన ప్రకారం... క్రమం తప్పకుండా పెరుగు తీసుకోవడం ఊబకాయం ఉన్న వారిలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.