మార్నింగ్ టిఫిన్ లో మనం చట్నీని తప్పకుండా తింటాము. చట్నీ లేకపోతే అస్సలు తినలేము. ఈ చట్నీలోనే రకరకాల చట్నీలను చేసుకునే తింటాము. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య తప్పక టిఫిన్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. లేకపోతే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తారు. అయితే టిఫిన్ లోకి ఓకే రకమైన చెట్నీ కాకుండా టేస్టీ టేస్టీ 4 రకాల చట్నీలు తయారు చేసుకోండి. ఇవి ఏ టిఫిన్స్ లో తిన్న కూడా చాలా రుచిగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.పల్లీ, పుట్టాల చట్నీ తయారీ చూద్దాం.  ముందుగా గ్యాస్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేయండి.

తరువాత పల్లీలు, పచ్చిమిర్చి, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి. పల్లీలు ఎర్రగా వేగాక.. మిక్స్ జార్ లో వేసుకోండి. ఇప్పుడు దానిలోనే ఒక పావు కప్పు పుట్యాలు, పచ్చి కొబ్బరి, రుచికి సరిపడా కొద్దిగా చింతపండు, సాల్ట్ వేసుకోండి. తరువాత పోపు దినుసులతో పోపు వేసి.. దాన్ని ఈ గ్రాండ్ చేసుకున్న ఈ మిశ్రమంలో కలిపితే చట్నీ రెడీ. మినప్పప్పు - శనగపప్పు చట్నీ తయారీ చూద్దాం. కడాయి పెట్టాక ఒకటి స్పూన్ మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి లో ఫ్రేమ్ లో పెట్టి మాడకుండా వేయించాలి.

5 నిమిషాలయ్యాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి,6 వెల్లుల్లి రెమ్మలు, చిన్న ఉల్లిపాయలు వేసి వేయించుకోండి. ఈ క్రమంలోనే సాల్ట్ యాడ్ చేయండి. తరువాత పుదీనా ఆకు అండ్ పచ్చి కొబ్బరి ఆడ్ చేసి వేగాక... ఇందులో కాస్త వాటర్ వేసి మిక్స్ పట్టండి... లాస్ట్ లో మిక్స్ పట్టింది. ఈ చట్నీ రెడీ అయినట్లే. వేయించిన పల్లీ - ఎండుమిర్చి చట్నీ తయారీ చూద్దాం. ఈ చట్నీ కోసం మిక్సీలో వేయించిన పల్లీలు, ఎండుమిరపకాయలు, సాల్ట్, వెల్లుల్లి వేసి మిక్స్ పట్టండి. తరువాత పోపు ఇందులో ఆడ్ చేస్తే ఈజీ టేస్టీ పల్లి, ఎండుమిర్చి చట్నీ తయారు అయిపోయినట్లే. అందరికీ ఇష్టమైన రుచికరమైన ఈ చట్నీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: