బియ్యం రేట్లు ఇప్పటికే చాలా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.మన ఆహారంలో అన్నం ముఖ్యమైన స్థానం పోషిస్తుంది. కాబట్టి అన్నాన్ని ఎవ్వరూ కూడా మానరు. ప్రతి ఒక్కరూ అన్నం ని తింటారు. సామాన్యులకు మరో బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే నిత్యవసర సరుకులు, ఆయిల్, పప్పు ధరలు భారీగా పెరగటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అదేవిధంగా ఉల్లి ధరలు సైతం పెరగడంతో సామాన్యులు భగ్గుమంటున్నారు. ఈ తరుణంలో సామాన్యుల పై మరో భారం పడనుంది. అదేంటంటే...? దేశంలో బియ్యం ధరలు భారీగా పెరగనున్నాయి.

 ప్రస్తుతం సోనా మైసూరి, హెచ్ ఎంటి, బీపిటీ తదితర సన్న బియ్యం ధరలు కిలోకు రూ.60 నుంచి 70 వరకు ఉన్నాయి. అయితే బాస్మతి యేతర బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేవేయడంతో బియ్యం రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. పారా బాయిల్డ్, బ్రౌన్ రైస్ పై ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గించటంతో ఈ ప్రభావం పడునుందని అనుకుంటున్నారు. మరోవైపు దేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సంభవించిన వరదలతో పంట నష్టం, వరి సాగు తగ్గటంతో బియ్యం రేట్లు పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. మారుతున్న కాలంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 కాగా బాస్మతి బియ్యం ధరలో మాత్రం పెద్దగా మార్పు ఉండదని తెలుస్తోంది. సామాన్యులు ఎంత ధరలు పెరిగినా కానీ కొనుక్కోలేని సమస్య ఉంటుంది. బాగా డబ్బు ఉన్నవాళ్లు మాత్రం ఎంత పెరిగినా ఇట్టే కొనేస్తారు. అటు ఇటు కాకుండా రైతులు నష్టపోతారు. కాబట్టి బియ్యం ధరలు పెరిగితే మాత్రం చాలా నష్టం వస్తుందని సూచిస్తున్నారు. డయాబెటిస్ సమస్య ఉన్నవాళ్లు అన్నాన్ని తగ్గించి తింటున్నారు. ఎలా తిన్నా కానీ అన్నం అయితే ఒక పూట తప్పకుండా తినాల్సిందే. ప్రభుత్వం రేషన్ గా ఇస్తున్న బియ్యం అసలు క్వాలిటీ ఉండకపోవటంతో కొనుక్కుని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: