ఈరోజుల్లో ఏ స్కిల్స్ ఉన్నా కానీ ఉద్యోగాలు ఇట్టే వచ్చేస్తున్నాయి. టాలెంట్ ఉండాలి కానీ ఏ పనైనా చేయవచ్చు. ఉద్యోగాలే కాదు టాలెంట్ ఉండాలే కానీ ఎన్నో రకాల వ్యాపారాలు కూడా చేయవచ్చు. టాలెంట్ ఎవరి సొత్తు కాదు... అది ఉండాలేగానీ ఏదైనా సాధించవచ్చు అంటున్నారు నిపుణులు. నీలోని వైపుణ్యాలకు ఇది వరిస్తుంది. ఆధునిక సమాజంలో, ముఖ్యంగా ఈ పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే ప్రధానంగా ఉండాల్సింది స్కిల్స్ మాత్రమే. అయితే కాలానుగుణంగా అవి కూడా మారుతుంటాయి. పదేండ్ల క్రితం నేర్చుకున్న అంశాలు, అలవర్చుకున్న నైపుణ్యాలు రేపటి జాబ్ మార్కెట్ కు పనికి రాకపోవచ్చు.

 కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మారుతున్న టెక్నాలజీని బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఎలాంటి కెరీర్ వైపు యూత్ ఆసక్తి చూపుతుంది? ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మేలు జరుగుతుందని విషయాలను నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటి నుంచి డిఫెన్స్ వరకు, హాస్పిటాలిటి నుంచి ఏమియేషన్ వరకు... ఇలా ఎక్కడ చూసినా ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మరింత పెరుగుతుందని, జాబ్ మార్కెట్ ను శాహించునుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అదే సందర్భంలో ఏఐ ప్రవేశంతో ఉద్యోగాలు ఊడుతాయన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నష్టాలు జరగవచ్చని కొందరు భావిస్తున్నారు. కానీ అలాంటి అవకాశాలు చాలా అరుదుగానే ఉంటాయని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఏఐతో పాటు ఇతర ఏ ఆధునిక సంకేతిక పరిజ్ఞానం వచ్చిన నష్టాల కంటే లాభాలే అధికంగా ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఏఐ బేస్డ్ స్కిల్స్ ఆధారంగానే భవిష్యత్తులో ఎంప్లాయిమెంట్ జనరేషన్ అధికంగా క్రియేట్ అయ్యే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే ప్యూచర్ జాబ్ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్న కోర్సులు నేర్చుకోవడం, వైపుణ్యం అలవర్చుకోవటం చాలా ముఖ్యమని కూడా నిపుణులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: