ఇక భరించాల్సిందే. కానీ చాలా కాలం అదే కొనసాగితే దుర్వాసన వెదజల్లే పరిస్థితి వస్తుంది. అధిక చమటలకు దుర్గంధం తోడైతే ' బ్రోమిడోసిస్' అనే బ్యాక్టీరియా డెవలప్ అవుతుందని, ఇది 'హైపర్ హైడ్రోసిస్' వ్యాధికి దారితీస్తుందని చర్మవ్యాధి నిపుణులు చెప్తున్నారు. చమట లోని లవణియతకు బ్యాక్టీరియా తోడైతే దుర్గంధం పెరుగుతుంది. అదే హైపర్ హైడ్రోజన్ వ్యాధికి దారితీస్తుంది. అయితే కొందరు చిన్న సమస్య అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎక్కువసార్లు స్నానం చేయటం వల్ల, అనుకూలంగా ఉండే దుస్తులు ధరించడం వల్ల ప్రాబ్లం క్లియర్ అవుతుందని మరీ కొందరు భావిస్తున్నారు. కానీ ఇది సరైన పరిష్కారం కాదని, వ్యాధికి గల మూల కారణాలను నివారించడమే మంచిదని చర్మ వైద్యాన్నిపుణులు చెప్తున్నారు.
విపరీతమైన చమటలతో వచ్చే దుర్గంధాన్ని పోగొట్టుకోవడానికి మెడికేటెడ్ సోప్స్, లోషన్స్, పౌడర్లు, సెంట్లు వాడుతుంటారు కొందరు. ఇవి కూడా పర్మినెంట్ సొల్యూషన్ కాదు. పైగా హైపర్ హైడ్రోసిస్ నిర్లక్ష్యం చేస్తే క్రమంగా ఎర్రటి లేదా నీలం రంగు చెమటలతో కూడిన 'క్రోమిడ్రోసిస్' అనే వ్యాధికి దారి తీయవచ్చు. కొన్నిసార్లు అసలుకే చెమలు చెమటలు పట్టకపోవడం అనే 'ఎన్ హైడ్రోసిస్' కు కారణం కావచ్చు. ఇది చమటలు పట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను అడ్డుకుంటుంది. అందుకే దుర్వాసనతో కూడిన అధిక చమటలు పట్టే పరిస్థితిని ఎదుర్కొనే వారు వాయిద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇక చమటలు పట్టినప్పుడు బయటకు రాకపోయినా, అధిక చమటలు పట్టిన, అసలుకే పట్టకపోయినా కూడా ప్రమాదమే. ఒక సాధారణ స్థాయిలో చెమటలు పట్టడమే మానవ ఆరోగ్యానికి మంచిది.