ఇది మంటను తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు పనితీరు బాగుండేలా చేస్తుంది. అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను, సాధారణ పేగు కదలికలను పెంచుతాయి. రోజు అభిసే గింజలను తినటం మలబద్ధకాన్ని నివారించవచ్చు. అవిసె గింజలలో లిగ్నన్లు ఉన్నాయి. ఇవి రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి కొన్ని హార్మోన్ సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి. మోనోపాజ్ సమస్యల్ని నివారిస్తాయి. అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల గుండె జబ్బులు, హాట్ ఎటాక్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
అవిసె గింజలు అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి, ఇది త్వరగా ఆకలి వెయ్యనివ్వవు. ఫలితంగా బరువు తగ్గుతారు. కాబట్టి దీనిని తప్పకుండా తినండి. బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా తినండి.డయాబెటిస్ ప్రాబ్లం ఉన్నవారు ఈ అవిస గింజలని తప్పకుండా తినండి. మలబద్ధకం లాంటి సమస్యలు ఉన్నవారు కూడా దీనిని తప్పకుండా తినండి. వాళ్లు వీళ్లు అనేమీ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ అవిసె గింజలను తినవచ్చు. దీంట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాబట్టి ఇవి తినటం మన ఆరోగ్యానికి కూడా మంచిదే.