అందుకు కారణం కాఫీలో 'కెఫిన్ ' కంటెంట్ ఉండటమే. కాబట్టి ఇది బెస్ట్ మూడ్ చేంజ్ టెక్నిక్ గా పనిచేస్తుందని చెప్పారు. రోజు రెండు లేదా మూడు కప్పుల వరకు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిదే. అంతకు మించితేనే రిస్క్ అంటున్నారు నిపుణులు. అయితే కాఫీ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పొద్దున్న లేవగానే ఆరుబయట కూర్చుని కాఫీ తాగనిదే కొందరికి పొద్దు గడవదు. పైగా ఇది వారిలో మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తుంది. తక్కువ స్థాయిలో కెఫిన్ తీసుకోవటం చురుకుదనాన్ని పెంచుతుంది.
మీ మూడ్ బాగోలేకున్నా సరే ఓ కప్పు కాఫీ తాగేస్తే సెట్ అయిపోతారు. అందుకే కాఫీని మూడ్ ఆఫ్ ను దూరం చేసే ఔషధంగా కొందరు పేర్కొంటున్నారు. బ్లాక్ కాఫీ, మిల్క్ కాఫీ అది ఏదైనా సరే మీ నాడీ వ్యవస్థను పేరేపించడం ద్వారా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అయితే ఇదంతా లిమిట్ గా తాగినప్పుడు మాత్రమే అని గుర్తుంచుకోండి. బ్లాక్ కాఫీ లేదా మిల్క్ కాఫీ రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తాగితే డయాబెటిస్ కంట్రోల్ అవుతుందని చెప్పారు. అయితే ఇందులో షుగర్ కు బదులు తేనె కలపాలి. లేదంటే షుగర్ ఫ్రీ కాఫినే ఆస్వాదించాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.