చాలామంది శిశువులు పుట్టిన వెంటనే ఎక్కువగా వెయిట్ అనేది ఉండరు. మరికొంతమంది శిశువులు వెయిట్ అనేది సరిపడా ఉంటారు. నవజాత శిశువు బరువు ఎంత ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు పుట్టగానే వైద్యులు ముందుగా వారి బరువును కొలిచి నోట్ చేసుకుంటారు. అయితే పుట్టిన సమయంలో శిశువులు సాధారణ బరువు కంటే తక్కువ బరువు ఉన్నారంటే వారు శారీరకంగా బలహీనంగా ఉన్నట్లు నిర్ధారిస్తారు. బిడ్డ సరిగ్గా అభివృద్ధి చెందలేదని, ఆ నవజాత శిశువు విషయంలో జాగ్రత్త వహించాలని చెప్తుంటారు. అలాంటి పిల్లలు చాలా బలహీనంగా ఉంటారు. అనేక వ్యాధుల ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు నిపుణులు.

 పుట్టినప్పుడు పూర్తికాల శిశువు బరువు 2.5 కిలోల కంటే తక్కువ ఉండాలని చెబుతున్నారు. 10 వ నెలలో జన్మించిన పిల్లల బరువు 3 నుండి 4 కిలోల వరకు పెరుగుతుంది. అయితే దీనికి విరుద్ధంగా నెలలు నిండకుండానే అంటే ఏడవ లేదా ఎనిమిదవ నెలలో పుట్టిన పిల్లల బరువు తరచుగా సాధారణ బరువు కంటే తక్కువగా ఉంటుందంటున్నారు. అలాగే ఒక స్త్రీకి కవలలు ఉన్నప్పటికీ, పిల్లల బరువు సాధారణం కంటే తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

పుట్టిన సమయంలో 2.5 నుండి 3 కిలోల బరువును శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు పరిగణిస్తారు. 1.5 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న శిశువును తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ అని అంటారంటున్నారు నిపుణులు. పుట్టిన సమయంలో బిడ్డ బరువు తక్కువగా ఉండటం మంచిది కాదని చెబుతున్నారు. కొన్నిసార్లు శరీరంలోని అవయవాలు అభివృద్ధి చెందనప్పుడు, బిడ్డ నెలలు నిండనప్పుడు బరువు తగ్గుతుందట. అలాంటి పిల్లలు తమంతట తాముగా పాలు తాగే స్థితిలో కూడా ఉంటారని చెబుతున్నారు. కాబట్టి అలాంటి పిల్లలకు అదనపు జాగ్రత్త అవసరం అంటున్నారు. అలాగే కొన్నిసార్లు అలాంటి పిల్లలకు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటుందట. అందుకే వారిని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో సహాయక వ్యవస్థలో ఉంచుతారని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: