పచ్చి  అరటిపండును తినటం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలుసా. పచ్చి అరటిపండును కూర వండుకుంటారు. లేదంటే బజ్జీలు కూడా వేసుకుంటారు. పచ్చి అరటికాయ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. డైలీ డైట్ లో పండ్లను తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదంటున్నారు వైద్య నిపుణులు. అందుకే రోజు పండ్లను తినాలని వైద్యులు సూచిస్తుంటారు. పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని బలోపేతం చేసే వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి. యాపిల్, ఆరెంజ్, జామ, దానిమ్మ ఇలా ఎన్నో పండ్లను తినటం ద్వారా శరీరానికి లెక్కలేనన్ని పోషకాలు అందుతాయి. అలాంటిదే మరో పండు ఉంది. దీనిని పచ్చిగా కూడా తినవచ్చు.

ఇంతకీ అది ఏంటి అనుకుంటున్నారా అదే పచ్చి అరటి పండు. ఈ పండు ఆరోగ్య నిధి అని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. పండిన అరటి పండులో విటమిన్లు, ఐరన్, ప్రోటీన్, మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం, కాపర్ వంటి పోషకాలు ఉన్నప్పటికీ, పచ్చి అరటి పండులో పోషకాల నిల్వలు అనేకం ఉన్నాయి. పచ్చి అరటి అనేక వ్యాధులను నివారిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశ్రమణాన్ని అందించడానికి కూడా పనిచేస్తుంది. పచ్చి అరటిపండు వల్ల కలిగే కొన్ని అద్భుత ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

NCBI ప్రకారం పచ్చి అరటి పండులో ప్రీ రాడికల్స్ తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్పలంగా ఉంటాయి. ఈ ఆంటీ ఆక్సిడెంట్ లో ఆరోగ్యకరమైన లక్షణాలను ఆక్సికరణ నష్టం నుంచి రక్షించడానికి కూడా పని చేస్తాయి. ఆకుపచ్చ అరటి పండులో బీటా కెరోటిన్, లుటీన్, జియాక్సంతిన్ వంటి ఇతర ఫ్రైటోన్యూట్రియెంట్ లతో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది.పచ్చి అరటిపండు తినటం వల్ల అతిసారం నుంచి ఉపశ్రమమం కలుగుతుంది. ఇది భారీ మొత్తంలో పోషకాలను కలిగి ఉంటుంది. అందుకే పచ్చి అరటి పండ్లు తినటం వల్ల వాంతులు, వికారం, అలసట మొదలైన సమస్యల నుంచి ఉపశ్రమమం లభిస్తుంది. డయాబెటిక్ రోగులు పచ్చి అరటి పండ్లను తీసుకోవటం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: