కండరాలను నివారించడంలో, కణజాలను బాగు చేయడంలో, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రోటీన్ సహాయపడుతుంది. అధికంగా ఉండే మాంసకృత్తులతో కూడిన ఈ అల్పాహారం మిమ్మల్ని ఎక్కువ కాలం కడుపు నిండినట్లుగా, సంతృప్తిగా ఉంచుతుంది. దీంతో చిరు తిండి పై మనసు పోకుండా బరువును కంట్రోల్ చేస్తుంది. బి- విటమిన్స్, ఐరన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన, నానబెట్టిన ముంగ్ దాల్ తక్షణ శక్తిని అందిస్తుంది, ఇది అల్పాహారానికి అనువైన ఎంపిక. కాగా ఇందులోని పోషకాలు శరీరంలో ఆక్సిజన్ రవాణాను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
అలసటతో పోరాడటంతో పాటు జీర్ణ క్రియ కు మద్దతు ఇస్తుంది. పెసర్లు నానబెట్టడం వల్ల సంక్లిష్ట చక్కెరలని విచ్చిన్నం చెయ్యటం, దీని ఫైటిక్ యాసిడ్ కంటెంట్ ను తగ్గించడం ద్వారా జీర్ణం సులభం అవుతుంది. పప్పులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్దకాన్ని నివారిస్తుంది. మీ పేగులను సమతూల్యంగా ఉంచుతుంది. నానబెట్టిన పెసరు పప్పు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అంటే ఇది చక్కెరను నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంతరించడంలో సహాయపడుతుంది, మధుమేహం ఉన్న వ్యక్తులకు, రోజంతా స్థిరమైన శక్తి స్థాయిలను కొనసాగించాలని చూస్తున్న వారికి ఇది ప్రయోజకరంగా ఉంటుంది.