అసలు ఇది ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది తెలుసుకుందాం. పరిగెత్తెడం ప్రారంభించినప్పుడు గుండె కండరాలకు ఎక్కువ రక్తాన్ని పంపుతుంది. తద్వారా ఆక్సిజన్ కోసం పెరిగిన డిమాండ్ ను తీర్చవచ్చు. రక్త ప్రవాహంలో ఈ అకస్మిక పెరుగుదల కేశనాళికలు, ధమనులను విస్తరించడానికి కారణం అవుతుంది. ఇది చర్మం లోని నరాల చివరలను ప్రేరేపిస్తుంది. ఇది దురదకు దారితీస్తుంది. వ్యాయామ సమయంలో రక్త నాళాలు వ్యాకోచించడం వల్ల అవి మెదడుకు దురద సంకేతాలను పంపే నరాల ఫైబర్ లను ప్రేరేపిస్తాయి.
ఇది వ్యాయామం తర్వాత సహజ ప్రతిస్పందన. కానీ ఇది చికాకు కలిగించవచ్చు. పరుగెత్తినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివలన చెమట పట్టటం, చర్మం రంధ్రాలు తెరుచుకోవడం జరుగుతుంది. బట్టలు, చర్మం మధ్య వేడి, చమట ఘర్షణ కలయిక దురదకు దోహదం చేస్తుంది. 2017లో జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజి ప్రకారం... వర్కౌట్ సెషన్ సమయంలో మరియు తరువాత హిస్టామిన్ అస్థిపంజర కండరాలతో సన్నిహితంగా చేరి ఉండవచ్చు. ఇది చర్మపు రోగనిరోధక ప్రతిస్పందనలో చేరి రక్త నాళాలను విడదీసి దురదను తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో రన్నర్ దురద వ్యాయామం – ప్రేరిత ఉర్టికేరియా లక్షణం కావచ్చు. శారీరక స్టమ వల్ల చర్మంపై దురదర్లు కనిపిస్తాయి. ఇది సాధారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుదల ద్వారా ప్రేరేపించబడుతుంది.