ఉదయం టిఫిన్ లో సాంబార్ ఇడ్లీని చాలామంది ఇష్టపడతారు. ఇడ్లీలు స్మూత్ గా ఉంటే టేస్ట్ గా ఉంటాయి. ఇడ్లీలోకి సరైన మంచి చెట్నీ లేదా సాంబారు ఉంటే చాలు. టేస్టీ టేస్టీగా తినేయవచ్చు. ఇడ్లీలు మెత్తగా ఉంటే ఇట్టే గొంతులోకి దిగిపోతాయి. అందరూ ఇష్టపడే టిఫిన్స్ లో ఇడ్లీ ఒకటి. హెల్త్ బాగో లేకపోయినా చాలామంది ఇడ్లీకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అలాగే ఇది తొందరగా డైజెషన్ అవుతుంది. కాగా ఇడ్లీలు మృదువుగా రావాలంటే ఇలా చేయండి. ఒకటి కూడా మిగలకుండా కుటుంబ సభ్యులంతా ఎంతో ఇష్టంగా తింటారు.

 మినప్పప్పును క్లీన్ గా కడుకుని ... అందులో వాటర్ పోసి 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టండి. దీంతో పాటు ఇడ్లీ రవ్వను కూడా తయారీకి గంట ముందు నానబెట్టాలి. తరువాత మినప్పప్పు లో చల్లని నీళ్లు పోసి మిక్స్ పట్టండి. ఎందుకంటే కూల్ వాటర్ పోస్తే ఇడ్లీలు మెత్తగా ఉంటాయి. తరువాత ఈ విష్టమంలో ఇడ్లీ రవ్వ కలిపి ఎనిమిది గంటల పాటు పులియబెట్టాలి. తరువాత సరిపడా సాల్ట్, వాటర్ పోసి కలిపి... ఇడ్లీ పాత్రలో వేసి సన్నని మంటపై 10 నిమిషాలు ఉడికించండి. ఇక మొత్తాని ఇడ్లీలు తయారు అయిపోయినట్లే.

 మీరు కూడా ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అయ్యి మృదువైన ఇడ్లీలు తయారు చేసుకోండి. మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే...? ఇడ్లీ చేసేటప్పుడు తప్పకుండా కేవలం సన్నని ఇడ్లీ రవ్వను మాత్రమే వాడండి. ఇలా చేస్తే ఇడ్లీలు మృదువుగా వస్తాయి. ఇడ్లీలో పల్లీ చట్నీ నంజుకుని తింటే బాగుంటుంది. లేదంటే సాంబార్లో కూడా వేసుకుని తినవచ్చు. మీరు పిండిని గ్రైండ్ చేసేటప్పుడు కూలింగ్ వాటర్ పోయటం మాత్రం మర్చిపోకండి. కూలింగ్ వాటర్ పోయటం వల్లే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. పూర్వకాలంలో రోటిలో రుబ్బేవారు. ఆ ఇడ్లీలు కూడా చాలా టేస్ట్ గా ఉండే. ఇప్పుడు గ్రైండర్ వచ్చేశాక ఇడ్లీలు కూడా టేస్ట్ ఉండటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: