దీనిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారు. కానీ.. ఆ టేస్ట్ మాత్రం రాదు. అలాంటప్పుడు కొన్ని ట్రిప్స్ పాటిస్తూ ముంత మసాలా చేసేస్తే టేస్ట్ అమోఘం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మరమరాలను క్రిస్పిగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ తరువాత అదే పాన్ లో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినా తర్వాత కార్న్ ప్లేక్ వేసి ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ కార్న్ ఫ్లేక్స్ అంటే పాలలో వేసుకుని తినేవి కాకుండా.. చిప్స్ తో పాటు లభించే కార్న్ ఫ్లేక్స్ వాడాలి.
ఇప్పుడే అదే నూనెలో పల్లీలు వేసి ఎర్రగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ పెద్ద బౌల్ తీసుకుని అందులోకి వేయించిన మరమరాలు, కార్న్ ఫ్లేక్స్ వేసి చేత్తో ప్రెస్ చేస్తూ కలపాలి. ఇందులోకి ఉల్లిపాయ తరుగు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, చాట్ మసాలా, నెయ్య, నిమ్మరసం, వేయించిన పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్ లో ఉప్పు, కారం, పసుపు చూసుకుని తక్కువ ఉంటే మరి కొంచెం కలుపుకోవచ్చు. కావాలంటే మిర్చి బజ్జిని కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. అంతే రూట్ సైడ్ లభించే రుచితో ముంత మసాలా రెడీ. రోడ్డుమీద టేస్ట్ లాగానే ఉంటుంది.