ప్రార్ధనలు కూడా చేస్తారు. ఈ నవరాత్రులలో చేసే ఉపవాసంలో ఎటువంటి దోషం ఉండకూడదని, పూజలు విజయవంతంగా, శుభప్రదంగా సాగాలని కోరుకుంటే నవరాత్రులలో ఏ రోజున ఏ రంగు బట్టలు ధరించి పూజించాలో తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం తిధి అక్టోబర్ 3 న అర్ధరాత్రి 12.19 గంటలకు ప్రారంభమై మర్నాడు అక్టోబర్ 4 న తెల్లవారుజామున 2.58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం శ్రావన్న వరత్రులు గురువారం అక్టోబర్ 3,2024 నుంచి ప్రారంభంకానున్నాయి. నవరాత్రులు అక్టోబర్ 12, 2024 శనివారం ముగుస్తుంది. మొదటి రోజు నవరాత్రుల మొదటి రోజున ఘనస్థాపన చేస్తారు. ఈరోజు శైలపుత్రిని పూజిస్తారు. శైలపుత్రికి ఇష్టమైన రంగు తెలుపు. అమ్మవారికి తెలుపు రంగు అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు.
కనుక నవరాత్రుల మొదటి రోజు తెల్లని వస్తువులు ధరించి శైలపుత్రి దేవిని పూజించటం చాలా శుభప్రదంగా భావిస్తారు. నవరాత్రుల రెండవ రోజున బ్రహ్మచారిణి తల్లిని పూజిస్తారు. తల్లి బ్రహ్మచారిని కూడా తెలుపు రంగు దుస్తులను ఇష్టపడుతుంది. కనుక నవరాత్రులలో రెండవ రోజున కూడా తెల్లని రంగును పూజలో ధరించాలి. మూడవ రోజు నవరాత్రులు రోజున చంద్రఘంట తల్లిని పూజిస్తారు. దుర్గా దేవికి ఎరుపు రంగు చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. ఈరోజున చంద్రఘంట రూపమైన దుర్గాదేవిని ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజించాలి. నాలుగవ రోజు నవరాత్రులు రోజున తల్లి కుష్మాండా దేవిని పూజిస్తారు. ఈరోజు నా ముదురు నీలం లేదా ఊదా రంగు దోస్తులు ధరించి కూష్మాండా దేవిని పూజించాలి. ఇలా చేయటం వల్ల అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని, ఇంటికి ఐశ్వర్యం చేకూరుతుందని నమ్మకం.