ప్రతిరోజు ఒకటి లేదా రెండు కీరదోస తినాలి. ఉల్లిపాయలు యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ బెలెన్న్ చేయటంలో సహాయపడతాయి. కిడ్నీలపై భారాన్ని తగ్గిస్తాయి. వెల్లుల్లి క్రియాటినైన్ స్థాయిలను నియంతరించడంలో సహాయపడతాయి. మీ భోజనంలో 1-2 వెల్లుల్లి రెబ్బలు జోడించండి. ఇవి శరీరంలో ఇన్ ఫ్లమేటరి లక్షణాలు తగ్గించడంలో, రక్తపోటును నియంతరించడంలో సహాయపడతాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రెడ్ బెల్ పెప్పర్ క్రియాటినైన స్థాయిలను నియంతరించడంలో సహాయపడుతుంది.
రోజులో కనీసం ఒక రెడ్ బెల్ పెప్పర్ ను తీసుకోవాలి. ఇది విటమిన్ లతో నిండి ఉంటుంది. మూత్రపిండాలపై అధిక భారం వేయదు. ప్రతిరోజు ఒక యాపిల్ మీకు ఫైబర్ ని ఇస్తుంది. మీ జీర్ణ క్రియ కు సహాయపడుతుంది. కిడ్నీలపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. క్రియాటీనైన్ తాగిలా తగ్గించుకునేందుకు రోజుకు ఒక యాపిల్ తినవచ్చు. కాలీఫ్లవర్ లో ఖనిజాలు తక్కువగా ఉంటాయి. వ్యర్దాలను తొలగించేందుకు కిడ్నీకి సహాయపడుతుంది. అర కప్పు వండిన కాలీఫ్లవర్ లో 1.8 గ్రా ఫైబర్ ఉంటుంది. ఇది క్రియాటినైన్ స్థాయిలను నియంతరించడంలో సహాయపడుతుంది. క్రాన్బెర్రి తీసుకోవటం ద్వారా యూరినరీ ట్రాక్ బాక్టిరియా ఇన్ఫెక్షన్ నువ్వు తగ్గించుకోవచ్చు. ఇది మూత్రపిండాలపై భారం తగ్గిస్తుంది.