సాధారణంగా ఎంతో మంది వాహనదారులు తమ తమ వాహనాలపై తమకు ఇష్టమైన రేడియం స్టిక్కర్లను అతికించుకోవడం చూస్తూ ఉంటాము. కొంతమంది ఇంటి సభ్యుల పేర్లను.. ఇలా స్టిక్కర్లుగా అతికించుకుంటే.. ఇంకొంతమంది వివిధ రకాల బొమ్మలను కూడా స్టిక్కర్లుగా అతికించుకోవడం చూస్తూ ఉంటాం. అయితే చాలామంది హిందూ సోదరులు ఇలా కార్లకి హనుమాన్ బొమ్మను స్టికర్లుగా అతికించుకోవడం చూస్తూ ఉంటాం. అయితే సాధారణంగా హిందువులు కాబట్టి హనుమాన్ ను ఎంతగానో విశ్వసిస్తారు. కాబట్టి ఇలాంటి స్టిక్కర్ వేసుకుని ఉంటారు అని అందరూ అనుకుంటారు.


 నిజమే హనుమాన్ అంటే హిందువులకు ఎంత ఆరాధ్య దైవమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ఆపద రాకుండా చూసుకుంటాడు. ప్రమాదాల నుంచి రక్షిస్తాడు. కనుక చాలామంది తమ వాహనాలపై ఆయనకు చెందిన ఒక పెద్ద స్టిక్కర్ను అతికించుకోవడం చేస్తూ ఉంటారు. కానీ ఈ స్టిక్కర్ వెనక ఒక పెద్ద స్టోరీ దాగి ఉందట. ఈ ఉగ్రరూప హనుమాన్ స్టిక్కర్ను నిజానికి కరణ్ ఆచార్య అనే గ్రాఫిక్ ఆర్టిస్ట్ వేశాడట. హనుమాన్ అంటేనే అతిబలవంతుడు. అందుకే ఉగ్రరూపం లో ఉంటే బాగుంటుందని ఆయన ఇలా కోపంగా చూస్తున్నట్లు బొమ్మ గీసాడట.



అయితే ఓ కంపెనీ ఆ బొమ్మకు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి హక్కులు తమకు ఇవ్వాలని కోరిందట. కానీ కరణ్ ఆచార్య అందుకు నిరాకరించాడు. ఇక ఆ బొమ్మను రాయాలిటీ ఫ్రీ బొమ్మగా వేశానని.. అందుకు డబ్బులు తీసుకోలేనని కరాకండిగా చెప్పేసాడు. దీంతో ఇక ప్రజలందరూ ఆ ఒక్క హనుమాన్ బొమ్మని ఉచితంగా వినియోగించుకోవచ్చు అని చెప్పాడట. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఆ స్టిక్కర్ సృష్టికర్తకు డబ్బులు వస్తాయన్న కూడా వదులుకోవడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెట్టిజెన్స్. అయితే నేటి రోజుల్లో ఈ ఉగ్రరూప హనుమాన్ స్టిక్కర్లు ఎక్కువ మొత్తంలో కార్ల వెనక అద్దాలపై కనిపిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం

మరింత సమాచారం తెలుసుకోండి: