కాలీఫ్లవర్ అంటే ఎంతమందికి నచ్చుతుంది. మరి కొంతమందికి నచ్చదు. కాగా అందరికీ నచ్చేలా కాలీఫ్లవర్ మసాలా రైస్ తయారు చేయండి. లంచ్ బాక్స్ లో కూడా, నైట్ డిన్నర్ లో కూడా ఎంతో బాగుంటుంది. అప్పుడు కాలీఫ్లవర్ అంటే నచ్చని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు కాలీఫ్లవర్ మసాలా రైస్ తయారీ విధానం ఎలాగో చూద్దాం. ఒక కప్పు కాలీఫ్లవర్ ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, బియ్యం - ఒకటిన్నర కప్పు, పసుపు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ధనియాలు పొడి, గరం మసాలా - ఒక టీస్పూన్, రెండు పచ్చిమిర్చి, పుదీనా తరుగు గుప్పెడు బఠానీలు, సరిపడా కొత్తిమీర, పచ్చి బఠానీలు - గుప్పెడు, నూనె - తగినంత తీసుకోవాలి.
ముందుగా రైస్ ను ఒక 80 శాతం ఉడికించి పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసి.. కాలీఫ్లవర్ ముక్కలు, అండ్ సాల్ట్, పసుపు, సరిపడా వాటర్ పోసి ఉడికించాలి. ఇప్పుడు మరో కడాయి తీసుకుని ఆయిల్ వేసి వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, బొటానిలు వేసి వేయించాలి. 10 నిమిషాలయ్యాక కాలీఫ్లవర్ ముక్కల్ని వెయ్యాలి. విశ్రమం అంతా వేగాక.. పుదీనా, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి.ఇక పక్కన పెట్టిన రైస్ ను అందులో వేసి కలిపి... లాస్ట్ లో కొత్తిమీర వేస్తే కాలీఫ్లవర్ మసాలా రైస్ తయారు అయినట్లే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.