పైగా దృష్టి మరల్చలేని ఆందోళన కలిగించే విషయాలు ఒక్కసారిగా గుర్తుకొస్తూ ఉండటం వల్ల కోర్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఓ వైపు ఆందోళన, దానిని ఎదుర్కొనేందుకు అవసరమైన హార్మోన్ల మధ్య ఏర్పడే రసాయనిక చర్యలు, మానసిక సంఘర్షణకు దారితీస్తాయి. దీంతో రాత్రిపూట ఆందోళన మరింత పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. మీరు ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటారు. కానీ బెడ్ పై వలగానే కొంతకాలం గా ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తుకు వస్తాయి. అప్పులు, తగాదాలు, అనారోగ్యాలు, ఇతరులతో, మానసిక పరిస్థితుల్లో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఆలోచనల రూపంలో వెంటాడుతుంటాయి.
దీంతో ఆందోళన పెరిగిపోతుంది. ఆ సమస్యల్లో గుండె వేగం సాధారణంకంటే పెరగడం, కండరాలు బిగుసుకుపోవటం అనుభూతి కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిగా కూడా అనిపించవచ్చు. నుదుటిపైన, అరచేతుల్లో చమటలు పడుతుంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే మీరు రాత్రి ఆందోళనతో బాధపడుతున్నట్లు గుర్తించి అలర్ట్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. వారానికి మించి ఈ విధమైన ఆందోళనతో మిమ్మల్ని వేధిస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఈ సమస్య ఎవరికైనా అనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించండి. చమటలు ఎక్కువగా పడుతుంటే దీనికి కూడా ఆందోళన కారణం అవుతుంది. ఆందోళనగా ఉన్న వారిని గుర్తించి వెంటనే వైద్య నిపుణుల దగ్గరికి తీసుకు వెళ్ళటం మంచిది.