పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలో చాలామందికి అవగాహన ఉండదు. పీరియడ్స్ రావాల్సిన సమయం కన్నా కాస్త రెండు, మూడు రోజులు లేట్ అయితేనే పెళ్లైన మహిళలకు సందేహాలు తలెత్తుతున్నాయి. పీరియడ్స్ రాలేదు అంటే కచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చినట్లే. అయితే అలాంటి సందేహాలు ఏం లేకుండా తప్పకుండా ప్రెగ్నెన్సీ అని నిర్ధారించే ఈ లక్షణాలతో ఈజీగా గమనించండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రొమ్ముల్లో సునీతత్వం ప్రెగ్నెన్సీ లక్షణాలను సూచించడంలో ఒకటి. చెస్ట్ ఉబ్బినట్లుగా ఉండటం, అలాగే తలనొప్పి రావటం కూడా. అలాగే ప్రెగ్నెన్సీలో ప్రోజెస్టిరాన్ లెవెల్స్ పెరగటం వల్ల విపరీతంగా అలసిపోతారు.
దీంతో చాలా వీక్ అయితారు. పైగా రాత్రంతా నిద్ర పట్టదు. మార్నింగ్ మార్నింగ్ ఏ వాంతులు అవుతాయి. వాంతులతో పాటు కళ్ళు తిరుగుతాయి. కొంతమందికి కేవలం ఉదయమే కాకుండా రోజులో ఎప్పుడైనా వాంతులు అవ్వచ్చు. మూడ్ స్వింగ్స్ మారుతుంటాయి. హార్మోన్లలో మార్పుల కారణంగా మానసికంగా ప్రభావం చూపుతుంది. దీంతో ప్రెగ్నెన్సీ సమయంలో భావోద్వేగాలు అదుపులో ఉండవు. తరచూ మూత్రానికి వెళ్లాలనిపించడం, కొత్తగా ఏదైనా ఫుడ్ తినాలనిపించడం, కొన్నిసార్లు వికారంగా అనిపించడం జరుగుతుంది. హార్మోన్లలో మార్పులో కారణంగా జీర్ణ క్రియపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీంతో జీర్ణ క్రియ మందగిస్తుంది. తద్వారా మలబద్ధకం, బ్లోటింగ్ వచ్చే సమస్యలు తలెత్తుతాయని గైనకాలజిస్ట్ చెబుతున్నారు.