తాజ్ మహల్ అంటే అందరికీ ఇష్టమే. తాజ్ మహల్ ని చూడగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు కొందరు. మరికొందరు తాజ్మహల్ దగ్గరికి ఎంత వెళ్దామని ట్రై చేసిన వెళ్లలేని పరిస్థితి ఎదుర్కొంటారు. తాజ్ మహల్.. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి స్మారక చిహ్నం. ఆధునిక ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటి. మొఘనత చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కు నిర్మించిన తెల్లని పాలరాతి సమాధి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సందర్శించే వారసత్వ ప్రదేశం. కాగా ఇతర వారసత్వ ప్రదేశాల మాదిరిగానే...

తాజ్ మహల్ దాని సొంతం కథ, రహస్యాలను కలిగి ఉంది. ఈ నిర్మాణం కింద 'తేజో మహలయ' అనే పురాతన శివాలయం శిధిలాలు, 22 రహస్య గదులు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఇక్కడ హిందూ దేవతల విగ్రహాలు, బొమ్మలు నిలవ చేయబడ్డాయని తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమనే దానిపై చర్చ జరుగుతుంది. తాజ్ మహల్ నేలమాళిగలో నిజానికి గదులు ఉన్నాయి. కానీ వాటి గురించి రహస్యంగా ఏమీ లేదు. ఇవి నిజంగా గదులు కావు. సమాధి నేలమాళిగలో తలుపు జత చేయబడిన పొడవైన వంపు గల కారిడార్.

ఈ ప్రాంతాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్రమం తప్పకుండా శుభ్రపరుస్తుంది. అయితే భద్రత కారణాల దృష్ట్యా తాళం వేసి ఉంచబడుతుంది. తాజ్ మహల్ కింద నిజానికి గదులు ఉన్నాయి, కానీ వాటి గురించి రహస్యంగా ఏమీ లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం బేస్మెంట్ గదులు సమాధి, మినార్లకు నిర్మాణాత్మకు మద్దతును అందిస్తాయి. సంవత్సరాలుగా ఈ రహస్య గదులలోని విషయాల గురించి అనేక కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. చాలామంది ఈ గదులు వేసవి వేడి నుంచి ఆశ్రమం కోసం ఉద్దేశించిన భూగర్భ గదిలో భాగామాని చెప్పుకోచ్చారు. అయితే అత్యంత వివాదాస్పదమైన... ఈ గదులలో హిందూ దేవుళ్ళు, దేవతల విగ్రహాలు ఉన్నాయని, హిందూ దేవాలయాన్ని సమాధిగా మార్చారనే అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: