ఎవరి లైఫ్ కూడా సోషల్ మీడియాలో చూపించిన ఫోటో మాదిరిగా పర్ఫెక్ట్ గా ఉండదు. పైకి గొప్పగా కనిపించిన వారి విషయంలోనూ కొన్ని లుప్ హోల్స్ ఉండవచ్చు. అంటే ఎవరు సంపూర్ణంగా ఉండలేరని గుర్తించి.. ఒకరితో కంపేర్ చేసుకోకుండా.. మన లైఫ్ మనం చూసుకుంటే హ్యాపీగా ఉండొచ్చని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు చేస్తే అసలుకే మోసం రావచ్చని హెచ్చరిస్తున్నారు. భాగస్వామితో పంచుకునే ప్రత్యేక బంధాన్ని కోల్పోయి.. అసంతృప్తి మాత్రమే మిగులుతుందని వార్న్ చేస్తున్నారు. ప్రేమ అనేది జీవితంలో చాలా విలువైనది. కానీ కొన్ని సందర్భాలలో కొందరితో బంధం మనను కోల్కోలేని దెబ్బతీయవచ్చు.
ఆ తరువాత మంచి పర్సన్ తోలవ్ లో పడొచ్చు. అలాంటప్పుడు ఆ సమయాన్ని, ఆ రిలేషన్ షిప్ ను ఎంజాయ్ చేయాలి. కానీ అనామసరంగా గతాన్ని తలుచుకుంటూ.. ప్రస్తుత బంధాన్ని అనుభూతి చెందడం మానేయకూడదు. అది అసలుకే ముప్పు తీసుకురావచ్చ. మీ ఇన్వాల్వ్మెంట్, ఇష్టం కనిపించని భాగస్వామి.. మీతో విసిపోవాలనుకునే నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అందమైన జీవితాన్ని నాశనం చేస్తుంది. అలాకాకుండా గతాన్ని పక్కన పెట్టేస్తే.. లవ్ జర్నీ చేయటం మరింత సులభం అవుతుంది. అంటే ఒక వ్యక్తి ఆనందం పూర్తిగా ఎదుటివారి చర్యలపై ఆధారపడి ఉంటాయి. ఇది వ్యక్తిగత ఎదుగుదలను అడ్డుకుంటుంది. అనారోగ్య డైనమిక్ లను ప్రోత్సహిస్తుంది. కాబట్టి చాలా హానికరం.