శెనగపిండి,పసుపు, కలబంద, దోసకాయ, పెరుగు వంటి వాటితో పలు చిట్కాలు ఫాలో అవుతుంటారు. నేచురల్ టిప్స్ లో ముఖానికి ఆవిరి పట్టటం కూడా ఒకటి. బ్యూటీ ట్రిట్మెంట్ లో కూడా ఆవిరి పడతారన్న విషయం తెలిసిందే. అయితే ఫేస్కు ఆవిరి పట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తాజాగా చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. ఆవిరి పట్టడం వల్ల స్కిన్ లోతుగా క్లీన్ అవుతుంది. మురికిని కూడా తొలగిస్తుంది. అలాగే మూసుకుపోయిన ముఖ చర్మ రంధ్రాలు తెరుచుకోవటంలో మేలు చేస్తుంది. బ్లాక్ హెడ్స కు చెక్ పెడుతుంది.
స్కిన్ లో పెరుగుపోయిన అదనపు ఆయిల్ ను తగ్గించడంలో తోడ్పడుతుంది. జిడ్డు స్కిన్ దూరం అవుతుంది. అంతేకాకుండా చర్మం హైడ్రేట్ గా మారుతుంది. ఫేస్ కు ఆవిరి పట్టటం ద్వారా హైడ్రా ఫేషియల్ లా ఉంటుంది. దీంతో బ్లడ్ సర్కులేషన్ సాఫీగా జరిగి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. ఆవిరి పట్టడం ద్వారా పింపుల్స్ కు కూడా చెక్ పెట్టొచ్చు. దీంతో మీ ముఖం నీటిగా కనిపిస్తుంది. అలాగే చర్మం కూడా రిలాక్స్ గా ఉండటంలో హెల్తీగా ఉంచడంలో మేలు చేస్తుంది. కానీ ప్రతిరోజు ఆవిరి పట్టకూడదు. రోజు ఆవిరి పట్టడం మంచిది కాదు. రెగ్యులర్గా ఫాలో అయితే మాత్రం చర్మ రంధ్రాలు వెడల్పు అయ్యే అవకాశం ఉంటుంది. కాగా 10 డేస్ కు ఒకసారి ఆవిరి పడితే చాలు.