కేవలం శారీరక సాన్నిహిత్యం కోసమే కలిసి ఉన్నట్లుగా అనిపించే ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలి? బంధంలో మళ్లీ నూతనోత్తేజం ఎలా నింపాలి ? అనేది సూచిస్తున్నారు నిపుణులు. మీకు, మీ భాగస్వామికి మధ్య ఉన్న దూరాన్ని తక్షణమే పరిష్కరించండి. వివాదాస్పద జీవనశైలి, కమ్యూనికేషన్ లేకపోవటం, ఎక్స్ పెక్టేషన్స్ ఇందుకు మూలా కారణం కావచ్చు. ఆచరణాత్మక సమస్యలు, భావోద్వేగా దూరాన్ని అర్థం చేసుకోవటం.. సమస్యను ఒకరి కోణం నుంచి చూసినప్పుడు మరింత సానుభూతి పొందుతారు. డిస్ కనెక్ట్ కు కారణమయ్యే వాటిని గుర్తించడం అర్ధవంతమైన మార్పులు చేయడానికి మొదటి అడుగు.
సమస్యలను పరిష్కరించిన తరువాత తాజాగా ప్రారంభించండి. కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వారా భావోద్వేగా, శారీరక సంబంధాన్ని పునర్నిర్మించండి. మీ బంధం ప్రారంభ రోజుల ఆనందాన్ని మళ్లీ అనుభవించడానికి బిజీ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకోండి. ఒకరికొకరు సర్ప్రైజ్ కలిగించేలా ప్లాన్ చేసుకోవటం, విహారయాత్రకు వెళ్లడం వంటివి చేయండి. సంబంధంలో డిస్ కనెక్ట్ అయ్యామని అంగీకరించడం ద్వారా నిజాయితీ తో కూడిన సంభాషణ ప్రారంభమవుతుంది. రిలేషన్ను కాపాడుకోవడానికి, కొనసాగించడానికి ఏదైనా అవకాశం ఉంటే ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలి. లేదంటే పరస్పర అవగాహన, గౌరవంతో, శాంతియుతంగా దానికి ఎండ్ కాట్ వేయాలి. లేదంటే శరీరాకంగా, మానసికంగా అలిసిపోయిన భావన కలుగుతుంది.