ఉదాహరణకు లైపోసక్షన్ కు వయోపరిమితి లేనప్పటికీ... వ్యక్తి చర్మ స్థితిస్థాపకత, ఆరోగ్యం, ప్రక్రియ కోసం సంసిద్ధత పై అనుకూలత ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. రోగులకు ఏదైనా కాస్మెటిక్ ప్రక్రియ గురించి సలహా ఇచ్చేముందు వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరీక్షించడం సర్జన్ బాధ్యత. అంతర్లీన వ్యాధితో బాధపడుతున్న వారికి దగ్గరి పర్యవేక్షణ అవసరం. ఉదాహరణకు మధుమేహ వ్యాధిగ్రస్తులు. వారి మధుమేహం బాగా నియంత్రించబడి, శస్త్రచికిత్సకు ముందు చేసిన పరీక్షల్లో ఒకే అయితేనే లైపోసక్షన్ చేయించుకోవచ్చు. అదేవిధంగా హైపర్ టెన్సివ్ రోగులను శస్త్రుచికిత్సకు ముందు, ఆ సమయంలో, తరువాత జాగ్రత్తగా చూసుకోవాలి. ఫలితాలను తెలుసుకోవడానికి క్షుణ్ణంగా ఆరోగ్య పరిక్ష, వివరణాత్మక సాంప్రదింపులు అవసరం.
తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, పేలవమైన జీవనశైలి అలవాట్లు ఉన్న వ్యక్తులు ప్రత్యామ్నాయాలను పరిగణించవలసి ఉంటుంది. గుండె జబ్బులు, నరాల సంబంధిత రుగ్మతలు, బలహీన రోగనిరోధక వ్యవస్థలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు అధిక ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. ప్రక్రియ తరువాత ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించలేని వారికి దీర్ఘకాలంలో లైపోసక్షన్ ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. అందుకే పే షెంట్ సెలక్షన్ నుంచి సర్జరీ వరకు ప్రతి అడుగు అత్యంత జాగ్రత్తగా వేయాలి. ప్రమాదం, దుష్ప్రభావాలను తగ్గించడానికి... మైక్రో ఎయిర్, VASER వంటి ఆధునిక సంకేతికత ప్రభావవంతంగా ఉంటుంది.