ఈ వివాహం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తూర్పు ఇండోనేషియాలో పూనక్ అనే ప్రదేశం పర్యాటకులకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇది కొండ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రజలు చాలా ఇష్టపడతారు. చాలామంది అరబ్బులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశంలో కోట బుంగా అనే పర్వత నిసార్ట్ ఉంది. ఇక్కడ మగాం పర్యాటకులు స్థానిక, యువతులకు ఏజెన్సీల ద్వారా పరిచయం చేస్తారు. తర్వాత మగ పర్యాటకుడు, స్త్రి మధ్య ప్లెజర్ మ్యారేజ్ ఏర్పాటు చేశారు. ఈ స్వల్పకాలిక వివాహం కోసం, పర్యాటకులు స్థానిక మహిళలకు డబ్బు చెల్లిస్తారు. వారిని పెయిడ్ వధువులు అని పిలుస్తారు.
ఆ తరువాత చిన్నప్పటి వేడుకలు ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు. ఈ వివాహం స్వల్పకాలికమైనందున, ఇది పర్యాటకుడు దేశంలో ఉండే వరకు మాత్రమే ఉంటుంది. పర్యాటకుడు దేశం విడిచి పెట్టిన తరువాత, ఇద్దరూ విడాకులు తీసుకుంటారు. లాస్ ఏంజిల్స్ టైమ్ లోని ఒక నివేదిక ప్రకారం ఈ వివాహాన్ని ఆనంద వివాహం అని పిలుస్తారు. ఈ వివాహం వల్ల ఒకవైపు పర్యాటకం ఊపందుకోగా, మరోవైపు ఆర్థిక వ్యవస్థలో కూడా వృద్ధి కనిపిస్తోంది. ఇంతకు ముందు కుటుంబాలు ఈ పద్ధతి కోసం అమ్మాయిలను పర్యాటకలకు పరిచయం చేసేవి, కానీ ఇప్పుడు దీనికోసం ఏజెన్సీలు ఏర్పడ్డాయి.