డిగ్రీ వరకు భారత్ లో చదివి ఉన్నత చదువులు ఆబ్రాడ్ లో చదవాలి. తమ పిల్లు జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిర పడాలి. ఇది నేటి తరం తల్లిదండ్రుల ఆలోచన. ఇక చదవితే ఆబర్ఆడ్ లోనే చదవాలి. అక్కడే కొలువు కొట్టాలి. అక్కడే స్థిరపడాలి. అక్కడి సొమ్ముతో భారత్ లో పెట్టుబడులు పెట్టాలి. ఇది నేటి తరం యువత ఆలోచన.


దీనిని నెరవేర్చుకునేందుకు యువత చాలా కష్టపడుతోంది. ఇక తల్లిదండ్రులు కూడా పిల్లల డాలర్ డ్రీమ్ ని నెరవేర్చేందుకు చాలా కష్టపడుతున్నారు. అప్పో సొప్పో చేసి ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అన్నీ కుదిరితే ఆబ్రాడ్ కు పంపుతున్నారు. కరోనా ముందు వరకు ఆబ్రాడ్ చదువులు బాగా సాగాయి. చదువు పేరుతో వెళ్తున్న చాలా మంది అక్కడి చదువుతూనే సంపాదించుకోవడం మొదలు పెట్టారు. ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మోహమాట పడేవారు కానీ.. అక్కడ షాప్ క్లీనర్లుగా, పెట్రోల్ బంకుల్లో, డెలీవరీ బాయిస్ గా, పనిచేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి అక్కడ ఏం చేసినా గౌరవంగానే ఉంటుంది.


అందుకే చాలా మంది అమెరికాతో పాటు యూకే, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా బాట పడుతున్నారు. చదువు కాస్తా తక్కువ ఉన్న వారు గల్ప్‌ దేశాలకు కూలీలగా వెళ్తున్నారు. కరోనా తర్వాత ఆర్థిక మాంద్యం, వర్క్ ఫ్రం హోం పెరగడంతో చాలా కంపెనీలు ఆర్థికంగా నష్టపోయాయి. దీంతో ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి.


 ఇక అమెరికాలో ఉద్యోగాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పెద్దపెద్ద కంపెనీలు ఇప్పటికే ఉన్నకొలువుల్లో కోత విధిస్తున్నాయి. ఇక కొత్త ఉద్యోగాల సంగతి అంతే. పార్ట్ టైం జాబులు కూడా దొరకడం లేదు. దీంతో విద్యార్థులు అమెరికా కన్నా.. యూకే, కెనడా, జపాన్, జర్మనీ ఆస్ర్టేలియా వెళ్తున్నారు. అక్కడ కూడా ఆ దేశ వలసలు పెరగడంతో నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఆ నేపథ్యంలో భారతీయుల విదేశాల్లో కొలువు కల చెదురుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: