హైదరాబాద్.. ఇది కేవలం ఒక మహానగరం మాత్రమే కాదు. ఎంతో మందికి జీవనోపాధిని చూపించిన ఒక గొప్ప ప్రాంతం. అయితే హైదరాబాద్లో పుట్టి పెరిగిన వారి కంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన వారే ఎక్కువగా ఉంటారు. పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి ఇక ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఫ్యామిలీకి దూరంగా ఉండేవాళ్ళు లక్షల్లోనే ఉంటారు అని చెప్పాలి. ఒక రకంగా జీవనోపాధికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. చిన్న ఉద్యోగం చేసుకునే వారి దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వారి వరకు ప్రతి ఒక్కరికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.



 చదువుకునే విద్యార్థులకు.. కోర్సులు నేర్చుకుని ఉద్యోగాలు చేయాలి అనుకునే గ్రాడ్యుయేట్లకు.. వ్యాపారం చేసి కోట్లల్లో సంపాదించాలి అనుకునే బిజినెస్ మాన్ లకు.. ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని పోషించాలి అనుకునే మిడిల్ క్లాస్ కుటుంబాలకు హైదరాబాద్ వేదికగా మారిపోయింది. దేశంలోని అన్ని రాష్ట్రాల వారు ఇక హైదరాబాదులో కనిపిస్తూ ఉంటారు. కొంతమంది ఇక్కడే సెటిల్ అయిపోతే ఇంకొంతమంది మాత్రం పండగలకు పబ్బాలకు మాత్రమే సొంతూరుకు వెళ్లి మళ్లీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉంటారు.


 అయితే హైదరాబాద్ గొప్పతనం ఏంటి అన్న విషయాన్ని ఇటీవల ఆటోవాలా ఒక్క కొటేషన్ తో చెప్పేసాడు  సాధారణంగా ఆటో నడిపే వాళ్ళు ఇక తమకు నచ్చిన కొటేషన్ ను ఆటో వెనుక భాగంలో కానీ లేదంటే ముందు భాగంలో కానీ రాసుకోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక ఆటోవాలా ఇలాంటిదే ఒక కొటేషన్ రాసాడు. బతకడమే వేస్ట్ అనుకున్న నాకు హైదరాబాద్ ఎలా బతకాలో నేర్పించింది అంటూ ఒక వ్యక్తి తన ఆటో వెనుక రాసుకున్నాడు. అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఉపాధి కోసం వస్తే అమ్మలా హైదరాబాద్ కడుపులో పెట్టి చూసుకుంటుంది అంటూ నెటిజెన్స్ ఇక ఈ కొటేషన్ పై స్పందిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: