అయితే ఇలా తమ కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇప్పటికే ఇంస్టాగ్రామ్ టిక్ టాక్ యాప్లలో ఉండే రీల్స్ కి పోటీ ఇచ్చే విధంగా అటు యూట్యూబ్ షాట్ వీడియోస్ ని తీసుకొచ్చింది. అయితే ఈ షార్ట్ వీడియోస్ లో 60 సెకండ్లు వీడియోని మాత్రమే పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ షార్ట్ వీడియోస్ నిడివిని పెంచాలి అంటూ ఎన్నో రోజుల నుంచి కంటెంట్ క్రియేటర్ల నుంచి యూట్యూబ్ కి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. కేవలం 60 సెకండ్లు మాత్రమే షార్ట్ చేసే అవకాశం ఉండడంతో తాము చెప్పాల్సిన సమాచారాన్ని సరైన రీతిలో చెప్పలేకపోతున్నామంటూ ఎంతోమంది కామెంట్లు పెట్టారు.
ఇదే విషయంపై యూట్యూబ్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకోబోతుంది అన్నది తెలుస్తుంది. ఇకనుంచి షార్ట్స్ షార్ట్ గా ఉండబోవు. ఎందుకంటే మొన్నటి వరకు కేవలం 60 సెకండ్ల నడివి ఉండే వీడియోని మాత్రమే షార్ట్స్ లో పోస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా ఈ నిడివిని మూడు నిమిషాలకు మారుస్తూ యూట్యూబ్ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈ అప్డేట్ అందరికీ అందుబాటులోకి రాబోతుందట. ఇక ఈ విషయం తెలిసి కంటెంట్ క్రియేటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మూడు నిమిషాల నిడివి కారణంగా తమ చెప్పాలనుకున్న సమాచారాన్ని క్లుప్తంగా చెప్పెందుకు అవకాశం ఉంటుందని.. యూట్యూబ్ తీసుకున్న గొప్ప నిర్ణయాలలో ఇది కూడా ఒకటి అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా క్రియేటర్స్ కి దసరా బోనస్ లాంటిది అంటూ ఎంతోమంది కామెంట్స్ చేస్తున్నారు.